Skip to main content

షేర్‌చాట్ గ్రూపుల పాలసీ

Last updated: 10th March 2021

మీరు ఇప్పుడు మా ఫ్లాట్‌ఫారంపై మీ స్నేహితులు మరియు ఇతర భావసారూప్యం కలిగిన వ్యక్తులతో అనుసంధానం కావడానికి షేర్‌చాట్‌పై గ్రూపుల ("గ్రూపులు")ను సృష్టించవచ్చు లేదా చేరవచ్చు. గ్రూపులు ఆసక్తులను పంచుకునే కమ్యూనిటీలు, ఇవి సమాచారాన్ని మార్పిడి చేసుకుంటాయి, కంటెంట్‌ని సృష్టిస్తాయి, మరియు మా ఫ్లాట్‌ఫారంపై వివిధ కార్యకలాపాల్లో పాల్పంచుకుంటాయి.

ఈ సెక్షన్ గ్రూపుల కొరకు నిర్ధిష్ట మార్గదర్శకాలను రూపొందిస్తుంది కనుక. మా ఫ్లాట్‌ఫారంపై ఉండే ఏదైనా సమాచారం వలే, గ్రూపులపై మీ కార్యకలాపాలు షేర్‌చాట్ కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలు, షేర్‌చాట్ గోప్యతా విధానం, మరియు మా షేర్‌సాట్ కుకీ పాలసీ(సమిష్టిగా "నిబంధనలు")కి లోబడి ఉంటాయి.

గ్రూపులు ఏవిధంగా పనిచేస్తాయి?#

ఏదైనా టాపిక్, థీమ్, సమస్య, లేదా యాక్టివిటీపై మీరు ఒక గ్రూపులో చేరవచ్చు లేదా సృష్టించవచ్చు. మీ గత ప్రవర్తన, లేదా కార్యకలాపాలు మా నిబంధనలు ఉల్లంఘించడానికి లోడబడి, ఒక గ్రూపుని సృష్టించడం, చేరడం లేదా పాల్గొనేందుకు మీ అభ్యర్ధనను మేం తిరస్కరించవచ్చు.

మీరు ఫ్లాట్‌పారంపై ఒక టాపిక్ కొరకు వెతకడం ద్వారా లేదా గ్రూపులను వెతకడం ద్వారా ఒక గ్రూపులో చేరవచ్చు. మీరు ఒక స్నేహితుడు లేదా షేర్‌చాట్‌పై ఒక కనెక్షన్ ద్వారా గ్రూపులో చేరేందుకు కూడా మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. గ్రూపులో చేరిన తరువాత, మీరు నియతానుసారంగా మీ కార్యకలాపాలు మరియు మీ మీ గ్రూపు సభ్యుల కార్యకలాపాల గురించి మీరు నోటిఫికేషన్‌లను పొందుతారు.

గ్రూపును విడిచిపెట్టడానికి, మీరు గ్రూపు హోమ్ పేజీకి వెళ్లి, ‘ గ్రూపును విడిచిపెట్టండి’ ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. గ్రూపును విడిచిపెట్టిన తరువాత సభ్యుల జాబితా నుంచి మీ పేరు తొలగించబడుతుంది, మరియు గ్రూపుపై కార్యకలాపాల అప్‌డేట్‌లను మీరు ఇక ఏమాత్రం అందుకోలేరు.

గ్రూపుల రకాలు#

రెండు రకాలైన గ్రూపులున్నాయి: పబ్లిక్ మరియు ప్రైవేట్.

  • పబ్లిక్ గ్రూపులు: పబ్లిక్ గ్రూపులను స్వేచ్ఛగా వెతకవచ్చు. సభ్యులు కానివారు గ్రూపు సభ్యులను చూడవచ్చు అలానే గ్రూపులో పబ్లిష్ అయిన పోస్ట్‌లను చూడవచ్చు.
  • ప్రైవేట్ గ్రూపులు: కేవలం సభ్యులు మాత్రమే గ్రూపుపై వ్యక్తుల జాబితాను, మరియు వారి ద్వారా పోస్ట్ చేయబడ్డ కంటెంట్‌ని చూడగలుగుతారు. ప్రైవేట్ గ్రూపులను సభ్యుడి నుంచి లింక్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. సభ్యత్వం ఆధారంగా కూడా గ్రూపులను వర్గీకరించవచ్చు. కొన్ని గ్రూపుల్లో చేరడానికి అడ్మిన్/మోడరేటర్ యొక్క ముందస్తు ఆమోదం అవసరం అవుతుంది, మిగిలినవి సభ్యులందరికి ఓపెన్‌గా ఉంటాయి.

గ్రూపులపై కమ్యూనికేషన్#

గ్రూపు సభ్యులతో టెక్ట్స్, ఇమేజ్‌లు, వీడియో లేదా ఆడియో చాట్‌లతో కమ్యూనికేట్ చేసేందుకు షేర్‌చాట్ ఫ్లాట్‌ఫారం మిమ్మల్ని అనుమతిస్తుంది. గ్రూపు సభ్యులతో నేరుగా మాట్లాడటానికి గ్రూపు సభ్యులను ‘పింగింగ్’ చేసే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది.

గ్రూపు సభ్యులతో ప్రత్యక్ష సంభాషణల్లో సైతం మీ ప్రవర్తన మా ఉపయోగ నిబంధనల ("నిబంధనలు")కు అనుగుణంగా ఉండాలని, మరియు ఏదైనా ఉల్లంఘన ఫలితంగా మీరు సంబంధిత గ్రూపు నుంచి తొలగించడం, సస్పెండ్ చేయడం, లేదా ఇతర చర్యలతోపాటుగా మా సర్వీస్‌లను క్యాన్సిల్ చేయడం జరుగుతుందని దయచేసి గమనించండి.

కొన్నిసార్లు మీరు గ్రూపులో పోస్ట్ చేసే కంటెంట్ ఇతరులకు కనిపించకపోవచ్చు. ఇతర యూజర్‌ల వీక్షణ సెట్టింగ్‌లపై ఇది ఆధారపడవచ్చు ( ఉదాహరణకు వారు ముందుగా ట్రెండింగ్/పాపులర్ పోస్ట్‌లను చేసేందుకు ఎంచుకున్నట్లయితే). కొన్ని సందర్భాల్లో, మీ పోస్ట్ స్పామ్ వలే వర్గీకరించబడుతుంది, ఇతర యూజర్‌ల ద్వారా సముచితమైనది కానిదిగా ఫ్లాగ్ చేయవచ్చు, లేదా మా టీమ్ ద్వారా రివ్యూ చేయబడవచ్చు, దీని ఫలితంగా ఇది పరిమితం చేయవచ్చు లేదా పరిమిత వీక్షణకు లభ్యం కావొచ్చు. మా నిబంధనలు లేదా కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లుగా మేం కనుగొన్నట్లయితే అటువంటి సందర్భాల్లో మీ పోస్ట్‌ని మేం సస్పెండ్ కూడా చేయవచ్చు.

మీ కంటెంట్ అన్యాయంగా సస్పెండ్ చేసినట్లుగా లేదా ఇతర యూజర్‌ల ద్వారా చూడలేకపోతున్నట్లుగా మీరు భావించినట్లయితే మీ గ్రూపు అడ్మిన్/మోడరేటర్‌కు మీరు నోటిఫై చేయాల్సి ఉంటుంది.

గ్రూపులపై మీ గోప్యతను సంరక్షించడం#

మీరు చేరే ఏదైనా గ్రూపు యొక్క సెట్టింగ్‌లను దయచేసి చెక్ చేయండి. అడ్మిన్ లేదా మోడరేటర్‌గా మీరు నియతానుసారంగా మీ గ్రూపు యొక్క సెట్టింగ్‌లను కూడా మీరు వీక్షించవచ్చు మరియు సవరించవచ్చు.

షేర్‌చాట్‌పై మీ గ్రూపు కొరకు వెతికే సామర్ధ్యాన్ని సవరించడానికి, ఏ సభ్యులు వీక్షించవచ్చు అని చూడటానికి, మరియు నియతానుసారంగా అడ్మిన్‌లు/మోడరేటర్‌లను గుర్తించడానికి గోప్యతా సెట్టింగ్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి.

గ్రూపు యొక్క గోప్యతా సెట్టింగ్‌లను బట్టి, మా టీమ్‌లు, తృతీయపక్ష కాంట్రాక్టర్‌లు, లేదా ఇతర పార్టీలు గ్రూపులోని యూజర్‌ల ద్వారా చర్యలను వీక్షించే సామర్ధ్యాన్ని కలిగి ఉండవచ్చు. ఈ హక్కులను కంటెంట్ మోడరేట్ చేయడానికి, ఫిర్యాదులకు విరుద్ధంగా చర్య తీసుకోవడం, మా అంతర్గత నిబంధనలు/పాలసీలు అమలు చేయడానికి, షేర్‌చాట్ ఫ్లాట్‌ఫారం పనితీరును సమీక్షించడానికి, మా సేవలను మెరుగుపరచడానికి, లేదా మా నిబంధనల ద్వారా అనుమతించిన విధంగా ఇతర చర్యలు తీసుకునే ప్రయోజనాల కొరకు ఉపయోగించవచ్చు.

ఫ్లాట్‌ఫారంపై గ్రూపుల కొరకు గోప్యతా సెట్టింగ్‌లను కేవలం అడ్మిన్‌లు మరియు మోడరేటర్‌లు మాత్రమే అప్‌డేట్ చేయగలరు అని దయచేసి గమనించండి. గ్రూపు గోప్యతా సెట్టింగ్‌లను మోసపూరితంగా మార్చడాన్ని షేర్‌చాట్ నిరోధించవచ్చు.

గ్రూపు 3,000 సభ్యులను దాటిన తరువాత గ్రూపు గోప్యతా విధానాన్ని అడ్మిన్ లేదా మోడరేటర్‌లు మార్చలేరు. అయితే, యూజర్ అభ్యర్ధనలు లేదా ఇతర పరిగణనల ఆధారంగా షేర్‌చాట్ టీమ్ ద్వారా అటువంటి మార్పులు చేపట్టవచ్చు.

అడ్మిన్‌లు మరియు మోడరేటర్‌లు#

గ్రూపు మేనేజ్‌మెంట్ పాత్రలు#

గ్రూపును నిర్వహించడం అనేది షేర్‌చాట్‌ గ్రూపులపై అడ్మిన్‌లు మరియు మోడరేటర్‌లు ద్వారా చేపట్టే ఒక స్వచ్ఛంద పాత్ర (సమిష్టిగా "గ్రూపు మేనేజర్‌లు"). సభ్యులను తొలగించడానికి, మరియు గ్రూపులను డిలీట్ చేయడానికి అడ్మిన్‌లకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. అడ్మిన్‌లు మరియు మోడరేటర్‌లు ఇద్దరూ గ్రూపు నిబంధనలను అభివృద్ధి చేయవచ్చు, గ్రూపు యొక్క వివరణ/ట్యాగులు అందించవచ్చు, పోస్ట్‌లు తొలగించవచ్చు, ఫిర్యాదులు సమీక్షించడం లేదా సభ్యులను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం చేయవచ్చు.

వారు గ్రూపు సృష్టించే సమయంలో స్వయంగా అపాయింట్ చేయబడ్డవారు కావొచ్చు లేదా గత అడ్మిన్‌లు/మోడరేటర్‌ల ద్వారా అపాయింట్ చేసిన వారు కావొచ్చు.

అయితే, వారు గ్రూపులోనే తమ అధికారాన్ని వినియోగించుకోవచ్చు. అడ్మిన్‌లు/మోడరేటర్‌లకు షేర్‌చాట్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. షేర్‌చాట్ తన విచక్షణ మేరకు, మా నిబంధనల ఉల్లంఘనతో సహా ఏదైనా కారణం కొరకు ఏ సమయంలోనైనా యూజర్ యొక్క అడ్మిన్/మోడరేటర్ హక్కులను పరిమితం చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు.

గ్రూపు మేనేజర్‌ల కొన్ని కీలకమైన పాత్రలు మరియు బాధ్యతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

కీలక విధులుఅడ్మిన్మోడరేటర్
ఇతర అడ్మిన్‌లను అపాయింట్ చేయవచ్చు×
ఇతర మోడరేటర్ అపాయింట్ చేయవచ్చు
పోస్ట్‌లను పరిమితం చేయవచ్చు, సస్పెండ్ చేయవచ్చు×
పోస్ట్‌లను సస్పెండ్ చేయవచ్చు, పరిమితం చేయవచ్చు మరియు గ్రూపు సభ్యులను తొలగించవచ్చు
గ్రూపు నిబంధనలను పాటించకపోవడం వల్ల యూజర్‌లకు హెచ్చరికలు/నోటీస్‌లు జారీ చేయడం

ఒక గ్రూపును నిర్వహించడానికి అంగీకరించడం ద్వారా, ఒక గ్రూపు మేనేజర్ వీటికి తన సమ్మతిని తెలియజేస్తాడు:

  • మా వర్తించే మార్గదర్శకాలను అనుసరించడం
  • ఇతర గ్రూపు సభ్యుల నుంచి రిపోర్ట్‌లు/ఫిర్యాదులు అందుకోవడం, మరియు పోస్ట్‌లు తొలగించడం, యూజర్‌లను సస్పెండ్ చేయడం లేదా మార్గదర్శకాలను అమలు చేయడానికి అవసరమైన ఏవైనా ఇతర చర్యలు తీసుకుంటారు
  • ప్రతిగా మోడరేటర్ చర్యలను చేపట్టడం
  • గ్రూపు నిర్ధిష్ట నిబంధనలు సృష్టించడం మరియు వాటిని అమలు చేయడం ( నిబంధనలు లేదా అడ్మిన్ లేదా మోడరేటర్‌లకు వర్తించే ఏవైనా ఇతర పాలసీలతో అవి విబేధించనంత వరకు)
  • ఈ విధులను చేపట్టడానికి ఎలాంటి ప్రతిఫలాన్ని పొందకపోవడం

గ్రూపు మేనేజర్ కొరకు విలువలు మరియు మంచి విధానాలు#

గ్రూపు మేనేజర్‌లు దిగువ వాటికి కృషి చేయాలి:

  • వారి గ్రూపుల కొరకు చేయదగిన మరియు చేయకూడని వాటిపై స్పష్టమైన మార్గదర్శకాలను అందించాలి
  • యాక్టివ్‌గా ఉండాలి. గ్రూపు మేనేజర్‌గా మీ కమ్యూనిటీకి నాయకత్వాన్ని అందిస్తారు – సముచితమైనప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారు, యూజర్‌లకు ఫీడ్‌బ్యాక్ అందిస్తారు, మరియు అవసరమైతే పోస్ట్‌లను పరిమితం చేయడం మరియు సస్పెండ్ చేయడానికి చర్యలు తీసుకుంటారు
  • మీ కమ్యూనిటీలో ఆరోగ్యవంతమైన, మరియు నిమగ్నత్మక సంభాషణలను ప్రోత్సహిస్తారు. మా కమ్యూనిటీ పాలసీని ఉల్లంఘించగల ఏవైనా సంభాషణలను గమనించడం
  • గ్రూపు మేనేజర్‌ల మీ టీమ్‌ని అభివృద్ధి చేయడం, ఈ పని కొరకు మీకు సాయపడటానికి కో-అడ్మిన్‌లు, మరియు మోడరేటర్‌లను అపాయింట్ చేయడం.

గ్రూపు మేనేజర్‌లు మరియు యూజర్‌ కొరకు ఉమ్మడి సమస్యలు#

షేర్‌చాట్ గ్రూపుల కమ్యూనిటీల సభ్యులుగా, దయచేసి జాగరూకతతో ఉండండి, ఇతర యూజర్‌లకు ప్రమాదం కలిగించే ప్రవర్తనకు విరుద్ధంగా గుర్తించి/ నివేదించాలి. గ్రూపుల్లో ఏవైనా కార్యకలాపాలు మా పాలసీలను ఉల్లంఘిస్తున్నట్లుగా మీరు భావించినట్లయితే, దయచేసి దీనిని మా అప్లికేషన్‌పై మాకు లేదా మీ గ్రూపు మేనేజర్‌లకు నివేదించండి.

నిషేధించిన విధానాలు#

నిర్ధిష్టంగా, గ్రూపులు దిగువ పేర్కొన్న కార్యకలాపాలను చేయరాదని దయచేసి గమనించండి:

  • స్కామ్‌లు/మోసపూరితమైన కార్యకలాపం: వేగంగా ధనవంతులు అయ్యే పథకాలు, నకిలీ ఉద్యోగాలు, లేదా తప్పుతోవ పట్టించే కార్యకలాపాలు, స్కామ్ లేదా యూజర్‌లను మోసగించే ఉద్దేశ్యం కలిగిన ఇతర కార్యక్రమాలను ప్రోత్సహించడం.
  • చట్టవ్యతిరేక లేదా నియంత్రించబడ్డ ఐటమ్‌లు: అందించడానికి యూజర్‌కు అధికారం లేని చట్టవ్యతిరేక గూడ్స్ లేదా సర్వీస్‌ల విక్రయాన్ని, లేదా నియంత్రించబడ్డ గూడ్స్ లేదా సర్వీస్‌లను అమ్మకాలను ప్రమోట్ చేయడం. ఉదాహరణకు, జూదం, చట్టవ్యతిరేక లాటరీలు, మాదక ద్రవ్యాలు మరియు నియంత్రిత పదార్థాల ప్రచారం లేదా ప్రిస్క్రిప్షన్ ఔషధాల‌ను అమ్మడం.
  • తప్పుడు అసోసియేషన్: ఆ విధంగా చేయడానికి అధికారం ఇవ్వనట్లయితే, గ్రూపులు లేదా కార్యకలాపాలు ఒక వ్యక్తి, బ్రాండ్ లేదా సంస్థ తరఫున పనిచేస్తున్న భావన కలిగించరాదు.
  • ద్వేషపూరిత ప్రసంగం లేదా వ్యక్తులను ప్రోత్సహించడం: గ్రూపులు విధిగా నేరపూరిత కార్యకలాపం లేదా అటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించే వ్యక్తులు/సంస్థలను ప్రోత్సహించరాదు. ఒకరినొకరి మధ్య ఏదైనా నేరపూరిత కార్యకలాపం, ద్వేష ప్రసంగం, హింస మరియు చట్టవ్యతిరేక కార్యక్రమాన్ని సమన్వయం నెరపడానికి మీరు గ్రూపులను ఉపయోగించరాదు.
  • సమ్మతి లేని కార్యక్రమాలను ప్రోత్సహించడం: ఎవరైనా వ్యక్తిని దోచుకునే లేదా ప్రమాదంలో పడేసే, వ్యభిచారం లేదా ఎస్కార్ట్ సర్వీస్‌లకు ప్రోత్సహించే లేదా బేరసారాలు చేసే ప్రయోజనం కొరకు చిత్రాలను పోస్ట్ చేయడం, పిల్లల నీలిచిత్రాలు (పిల్లల నీలిచిత్రాలను సృష్టించడం, ప్రమోట్ చేయడం, పెద్దది చేసి చూపించడం, ప్రసారం చేయడం లేదా బ్రౌజ్ చేయడంతో సహా అయితే వాటికే పరిమితం కాకుండా); మానభంగం, సామూహిక మానభంగం, లైంగిక ఆక్షేపిత, సమ్మతి లేని కార్యకలాపాలు మరియు వేధింపుల కంటెంట్‌ని గ్రూపులు విధిగా ప్రోత్సహించరాదు.

డేటా సేకరణ#

ఈ డేటా సేకరణ కార్యక్రమం షేర్‌చాట్ ద్వారా కాకుండా, మీ ద్వారా నిర్వహించబడుతోందని దయచేసి యూజర్‌లకు స్పష్టంగా మరియు వివరంగా తెలియజేయండి. మీ అభ్యర్ధనలో పేర్కొన్న ప్రయోజనాల కొరకు మాత్రమే డేటా ఉపయోగించబడుతుంది. సేకరించిన డేటాను దయచేసి పేర్కొనబడ్డ ఉద్దేశ్యాలు మరియు వర్తించే చట్టాలకు అనుగుణంగా మాత్రమే ఉపయోగించండి.

షేర్‌చాట్ నుంచి నిర్ధిష్ట అనుమతి లేకుండా - మా గ్రూపులపై ఆటోమేటెడ్ మరియు మాస్ డేటా కలెక్షన్‌ నుంచి కూడా యూజర్‌లు నిషేధించబడతారు.

ప్రమోషన్‌లు, పోటీలు, మరియు ఇతర కార్యకలాపాలు నిర్వహించడం#

పోటీలు, గేమ్స్ లేదా ప్రమోషనల్ కార్యకలాపాలను నిర్వహించడానికి మీరు గ్రూపులను ఉపయోగించేటప్పుడు, అటువంటి కార్యకలాపాలు వర్తించే చట్టాలకు అనుగుణంగా ఉన్నట్లుగా ధృవీకరించేందుకు యూజర్‌లు బాధ్యత వహిస్తారు. ప్రతి పోటీ గేమ్‌కు బ్రాండ్‌లు, అధికారులు మరియు అవసరమైన విధంగా ఏదైనా ఇతర పార్టీ నుంచి – అవసరమైన అనుమతులు విధిగా ఉండాలి. ఆఫర్ చేసే ఏవైనా ప్రైజులు వర్తించే భారతీయ చట్టాలకు అనుగుణంగా ఉండాలి.

ఈ కార్యకలాపాలు షేర్‌చాట్ ద్వారా నిర్వహించబడవని మరియు షేర్‌చాట్ వాటికి బాధ్యత వహించదని లేదా లయబిలిటీ ఉండదని కూడా పోటీలు స్పష్టంగా పేర్కొనాలి.

బ్రాండ్‌లు మరియు మేధోపరమైన ఆస్తి ఉపయోగం#

దయచేసి బ్రాండ్ పేర్లు, ట్రేడ్‌మార్క్‌లు, కాపీరైట్ మరియు ఇతర మేధోపరమైన ఆస్తిని వర్తించే చట్టాలకు అనుగుణంగా ఉపయోగించండి. అవసరమైనప్పుడు, ఒక బ్రాండ్/ సంస్థతో మీ అసోసియేషన్ లేదా మీ కార్యకలాపాల యొక్క వాణిజ్య స్వభావం గురించి కూడా వెల్లడించడం మరియు అస్వీకారాలను దయచేసి అందించండి.

మీ గ్రూపు ఒక ఫ్యాన్/సపోర్టర్ క్లబ్ లేదా నిర్ధిష్ట ఆర్గనైజేషన్‌లు, వ్యక్తులు, లేదా బ్రాండ్‌లను చర్చించడానికి ఉద్దేశించినట్లయితే, దయచేసి అస్వీకరాలను జారీ చేయండి మరియు అటువంటి నటులు, వ్యక్తులు, బ్రాండ్‌లు లేదా సంస్థలతో మీరు అసోసియేట్ కాలేదని మరియు వారికి ఏవిధంగాను ప్రాతినిధ్యం వహించడం లేదని స్పష్టంగా పేర్కొనండి.

గ్రూపు పేర్లు మరియు గుర్తింపు#

గ్రూపు పేర్లు స్పషట్ంగా గ్రూపు కారణం మరియు ఉద్దేశ్యాన్ని తెలియజేయాలి. అవి, సాధ్యమైనంత వరకు, అసభ్యకరమైన పేరును ఉపయోగించరాదు, అత్యంత సాధారణ స్వభావాన్ని కలిగి ఉండాలి, మరియు చట్టవ్యతిరేక కార్యక్రమాలను నిర్వహించడాన్ని ప్రోత్సహించడం లేదా చట్టవ్యతిరేక/హానికరమైన వ్యక్తులు లేదా సంస్థల ప్రమోట్ చేయరాదు.

జాబ్ పోస్టింగ్‌లు#

గ్రూపుల్లో ఆఫర్ చేసే ఏదైనా ఉద్యోగం లేదా ఇంటర్న్‌షిప్ పొజిషన్‌ల్లో- ఎలా అప్లై చేయాలి, అర్హతా పరమాణాలు, సంప్రదించు వివరాలు మరియు ఇతర అటువంటి సమాచారంతో దయచేసి స్పష్టమైన ఆదేశాలను అందించండి. గ్రూపులను జాబ్ స్కామ్‌లు, లేదా ఇతర వంచన విధానాలు నిర్వహించడానికి ఉపయోగించలేదు. అన్నింటిని మించి, మీరు వర్తించే చట్టాలను ఉల్లంఘించే చట్టవ్యతిరేక, మోసపూరితమైన లేదా హానికరమైన ఉద్యోగాల కొరకు ప్రకటనలు చేయలేరు. జాబ్ పోస్టింగ్‌లు వ్యక్తుల విరుద్ధంగా చట్టవ్యతిరేక వివక్ష చూపరాదు.

గ్రూపు మరియు యూజర్ ప్రవర్తనను నివేదించడం#

ఈ గ్రూపు పాలసీ, లేదా వర్తించే చట్టాలతో సహా మా నిబంధనలకు నుగుణంగా లేనట్లుగా వారు విశ్వసించే ఏవైనా కార్యకలాపాలను యూజర్‌లు నివేదించవచ్చు. కొన్ని కేసుల్లో (i) గ్రూపు మేనేజర్, లేదా (ii) షేర్‌చాట్‌లో ఒకరిని నివేదించవచ్చు.

గ్రూపుపై ఏదైనా కార్యక్రమాన్ని ఎవరైనా నివేదించినప్పుడు, గ్రూపు మేనేజర్‌గా మీకు తెలియజేయబడుతుంది. మీరు తరువాత దిగువ పేర్కొన్న దేని ద్వారా అయినా రిపోర్ట్‌ని నిర్వహించవచ్చు:

  • ఏదైనా చర్య తీసుకోరాదని నిర్ణయించడం,
  • యూజర్‌కు హెచ్చరిక జారీ చేయడం
  • పోస్ట్‌ని మోడరేట్ చేయడం
  • యూజర్‌ని సస్పెండ్ చేయడం
  • గ్రూపు నుంచి యూజర్‌ని తొలగించడం.

దీనికి అదనంగా, గ్రూపు లోపల కార్యకలాపాలపై యూజర్‌ల ద్వారా ఫిర్యాదులను కూడా మీరు సమీక్షించవచ్చు. అటువంటి సందర్భాల్లో మేం వీటి ద్వారా నిబంధనలను అమలు చేయవచ్చు:

  • నిర్ధిష్ట నియమాలను అమలు చేయమని అడగడం లేదా హెచ్చరికలు జారీ చేయడం
  • తాత్కాలిక సస్పెన్షన్‌లు
  • సౌలభ్యాలను తొలగించడం,
  • కంటెంట్ తొలగించడం లేదా కంటెంట్ యాక్సెస్/చేరికను పరిమితం చేయడం
  • పాలసీ నుంచి యూజర్‌లను తొలగించడం
  • గ్రూపుకు కొత్త సభ్యులను జోడించడాన్ని పరిమితం చేయడం
  • గ్రూపును నిషేధించడం/మూసివేయడం

సాధారణం#

ఫ్లాట్‌ఫారంపై గ్రూపులు అర్థవంతమైన సంబంధాలను సృష్టించడానికి, భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడానికి, మీ అభిప్రాయాలు మరియు ఆసక్తులను పంచుకోవడానికి అదేవిధంగా వివేచనాత్మక చర్చలు చేయడానికి ఒక నిర్మాణ సాధనంగా ఉపయోగించవచ్చు. సురక్షితమైన మరియు ఎదుగుతున్న కమ్యూనిటీని పెంపొందించడానికి, పైన పేర్కొన్న మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం, అలానే ఫ్లాట్‌ఫారం నిబంధనలను పాటించడం అత్యావశ్యకం. ఒక సురక్షితమైన ప్రదేశాన్ని సృష్టించడం మరియు వైవిద్యతను ప్రోత్సహించడం మరియు గ్రూపుల ఫీచర్‌ల ద్వారా ఫ్లాట్‌ఫారంపై చేరికను ప్రోత్సహించేందుకు మాకు సాయపడేలా మా యూజర్‌లను మేం ప్రోత్సహిస్తాం. మా యూజర్‌లు దయగా, మర్యాదపూర్వకంగా ఉండాలని, మరియు ద్వేష ప్రసంగం, వేధింపులు, గుడ్డి బెదిరింపులు, స్పామ్ మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల నుంచి దూరంగా ఉండాలని మేం అభ్యర్ధిస్తాం.