షేర్‌చాట్ చాట్‌రూమ్ పాలసీ
Last updated: 13th December 2023
ఈ చాట్‌రూమ్ పాలసీ ("చాట్‌రూమ్ పాలసీ") https://sharechat.com/ వద్ద ఉండే మా వెబ్‌సైట్ మరియు/లేదా ShareChat మొబైల్ అప్లికేషన్ (సంయుక్తంగా, "ఫ్లాట్‌ఫారం")పై మా చాట్‌రూమ్ ఫీచర్ ("ఫీచర్") యొక్క మీ ఉపయోగాన్ని పరిపాలిస్తుంది, ఇది భారతీయ చట్టాల ద్వారా ఏర్పాటు చేయబడి, మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ టవర్ స్మార్టువర్క్స్, వైష్ణవి టెక్ పార్క్, సర్వే నెం 16/1 & నెం 17/2 అంబలిపురా విలేజ్, వార్తుర్ హొబ్లీ, బెంగళూరు అర్బన్, కర్ణాటక – 560103 వద్ద రిజిస్టర్ ఆఫీసు కలిగిన ఒక ప్రైవేట్ కంపెనీ అయిన మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్. ("షేర్‌చాట్", "కంపెనీ", "మేం", "మా" మరియు "మా యొక్క") ద్వారా అందించబడుతోంది. "మీరు" మరియు "మీ యొక్క" అనే పదాలు ఫ్లాట్‌ఫారం యూజర్‌ని తెలియజేస్తాయి.
మీ స్నేహితులతో టచ్‌లో ఉండటానికి మరియు ఇమేజ్‌లు, వీడియోలు, మ్యూజిక్, స్థితి అప్‌డేట్‌లు, మరియు మీరు ఇష్టపడే ప్రాంతీయ భాషలో ఇంకా మరిన్ని పంచుకోవడానికి మా ఫ్లాట్‌ఫారం మీకు సాయపడుతుంది. మీరు ఇష్టపడే కంటెంట్‌ని మేం అర్థం చేసుకుంటాం మరియు మా ఫ్లాట్‌ఫారంపై ("సర్వీస్/సర్వీస్‌లు") లభ్యమయ్యే పోస్ట్‌లు, చిత్రాలు, వీడియోలు, మరియు సూచించిన కంటెంట్‌ని చూపించడానికి మీ న్యూస్‌ఫీడ్‌ని వ్యక్తిగతీకరిస్తాం.
సాధారణ మర్యాద
ఫ్లాట్‌ఫారంపై మీరు ఫీచర్‌ని ఉపయోగించినప్పుడు, అన్నివేళలా దిగువ నిబంధనల ("నిబంధనలు")కు కట్టుబడి ఉండేందుకు మీరు అంగీకరిస్తున్నారు. మీరు విధిగా:
- సర్వీస్‌పై నిజమైన పేరు మరియు గుర్తింపును ఉపయోగించడం;
- మా ఉపయోగ నిబంధనలు మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలను. చదవండి మరియు కట్టుబడి ఉండండి. ఇతరుల్లో మీరు వీటిని పాటించాలని దీని అర్థం:
- ఎవరైనా వ్యక్తి లేదా వ్యక్తుల గ్రూపులను దూషించడం, గుడ్డిబెదిరింపులు లేదా వేధింపులకు పాల్పడరాదు. మర్యాదపూర్వక సంభాషణల్లో నిమగ్నం కావాలని మేం మిమ్మల్ని కోరుతున్నాం;
- వివక్ష చూపడం, ద్వేషపూరిత ప్రవర్తనకు పాల్పడడం లేదా ఏదైనా వ్యక్తి లేదా వ్యక్తుల గ్రూపులకు విరుద్ధంగా హింస లేదా హాని కలిగిస్తామని బెదిరించరాదు.;
- వారి సరైన అనుమతి లేకుండా ఇతర వ్యక్తుల వ్యక్తిగత సమాచారం, చిత్రాలు మరియు ఇతర సమాచారాన్ని పంచుకోవడం, పంచుకునేందుకు బెదిరించడం లేదా ఇతర వ్యక్తులు పంచుకునేలా ప్రోత్సహించరాదు;
- ముందస్తు అనుమతి లేకుండా ఫ్లాట్‌ఫారంపై పొందిన సమాచారాన్ని ట్రాన్స్‌స్క్రైబ్ చేయడం, రికార్డ్ చేయడం, లేదా మరోవిధంగా పునరుత్పత్తి మరియు/లేదా పంచుకోరాదు;
- ఏదైనా మేధోపరమైన ఆస్తి లేదా ఇతర యాజమాన్యత హక్కులను ఉల్లంఘించే ఏవైనా సంభాషణల్లో నిమగ్నం కారాదు లేదా ఏదైనా కంటెంట్‌ని అప్‌లోడ్ చేయరాదు;
- తప్పుడు సమాచారం లేదా స్పామ్ వ్యాప్తి చెందించకుండా ఉండటం లేదా సమాచారాన్ని కృత్రిమంగా వ్యాప్తి చేయడం లేదా అణిచివేయడం చేయరాదు;
- మైనర్‌లతో సహా ఎవరైనా వ్యక్తులు లేదా గ్రూపులకు హాని కలిగించే ఉద్దేశ్యంతో లేదా హాని కలిగించగల సమాచారాన్ని (లేదా కృత్రిమ లేదా మానిప్యులేటెడ్ మీడియా) పంచుకోరాదు లేదా ప్రోత్సహించరాదు; మరియు
- పెద్ద సంఖ్యలో యూజర్‌లు లేదా సాధారణ ప్రజానీకానికి హాని కలిగించే లేదా తప్పుతోవ పట్టించగలిగే అవకాశం ఉన్న ఏదైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించరాదు.
- వర్తించే చట్టాల ప్రకారంగా ఏదైనా అనధీకృత లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించే ఉద్దేశం కొరకు సర్వీస్‌ని ఉపయోగించరాదు.
భద్రత
ఫ్లాట్‌పారంపై ఎవరితో ఇంటరాక్ట్ కావాలనేది మీరు నిర్ణయించుకోవచ్చు:
- అన్‌ఫాలో చేయడం: మీరు ఏ సమయంలోనైనా ఒక యూజర్‌ని అన్‌ఫాలో చేయవచ్చు. ఈ విధంగా చేయడానికి, యూజర్ ప్రొఫైల్‌కు వెళ్లండి మరియు దానిని అన్‌సెలక్ట్ చేయడానికి ''ఫాలోయింగ్'' అని ఉండే బటన్ మీద తట్టండి. వారికి తెలియజేయబడదు, మరియు వారి కార్యకలాపం గురించి మీరు తదుపరి ఎలాంటి నోటిఫికేషన్‌లను అందుకోరు.
- బ్లాక్: మీరు ఏ సమయంలోనైనా ఒక యూజర్‌ని బ్లాక్ చేయవచ్చు. బ్లాక్ చేసిన యూజర్‌లు మీరు సృష్టించిన లేదా మీరు మోడరేటర్ లేదా అడ్మిన్‌గా ఉండే ఏదైనా రూమ్‌ని చూడలేరు లేదా చేరలేరు.
నివేదించడం
యూజర్ ద్వారా ఈ చాట్‌రూమ్ పాలసీ/నిబంధనలు ఉల్లంఘించినట్లుగా మీరు గమనించినట్లయితే, దయచేసి దానిని contact@sharechat.co వద్ద నివేదించండి. చాట్ రూమ్ పాలసీని ఉల్లంఘించినట్లుగా అనేకసార్లు నివేదించినట్లయితే, మేం అనివార్యంగా మాతో మీ ఖాతాను రద్దు చేసి, మాతో రిజిస్టర్ కాకుండా మిమ్మల్ని నిరోధించవచ్చు. ఏదైనా అటువంటి తొలగింపును మీరు అప్పీల్ చేయాలని కోరుకున్నట్లయితే, మీరు contact@sharechat.co.
యూజర్‌లకు గమనికలు:
- వర్చువల్ గిఫ్టింగ్ లావాదేవీలను సులభతరం చేయడానికి ఫోన్ నంబర్ వంటి మీ వ్యక్తిగత వివరాలను మా పేమెంట్ గేట్‌వే భాగస్వామితో పంచుకోవచ్చు.
- ఫ్లాట్‌ఫారంపై ఇతర యూజర్‌లతో మీ ఇంటరాక్షన్‌లకు మీరే పూర్తిగా బాధ్యత వహిస్తారు మరియు అటువంటి ఇంటరాక్షన్‌లకు సంబంధించి మాకు ఎటువంటి పూచీ లేదా బాధ్యత ఉండవు అని మీరు అంగీకరిస్తున్నారు.
- ఏది ఉల్లంఘనకు అని మా పూర్తి విచక్షణ మేరకు నిర్ధారించే హక్కు మాకు దఖలు పడి ఉంటుంది.
- ఏ సమయంలోనైనా ఈ చాట్‌రూమ్ పాలసీ యొక్క భాగాలను మా పూర్తి విచక్షణ మేరకు మార్చేందుకు మాకు హక్కు దఖలు పడి ఉంటుంది. మేం ఈ విధంగా చేసినట్లయితే, మేం ఈ పేజీపై మార్పులను పోస్ట్ చేస్తాం మరియు ఈ నిబంధనలు చివరిగా అప్‌డేట్ చేసిన తేదీని ఈ పేజీ పైన సూచిస్తాం.
- చాట్‌రూమ్‌ల్లో వర్చువల్ గిఫ్టింగ్ బాక్స్ ఆప్షన్ ఎనేబుల్ చేయడానికి మేం ఎన్నడూ ఛార్జ్ చేయం. దయచేసి ఆ విధంగా చేయకుండా ఉండండి లేదా ఒకవేళ మీరు ఫ్లాట్‌ఫారంపై అటువంటి కార్యకలాపాలను కనుగొన్నట్లయితే, దయచేసి దానిని contact@sharechat.co కు నివేదించండి.