షేర్‌చాట్ కంటెంట్ పాలసీ
Last updated: 29th October 2024
ఈ కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలు ("మార్గదర్శకాలు") మా వెబ్‌సైట్ అయిన https://sharechat.com మరియు/లేదా షేర్‌చాట్ మొబైల్ అప్లికేషన్ మరియు దాని వెర్షన్‌లలో (“యాప్”) ఉన్న మీ వినియోగాన్ని నియంత్రిస్తాయి. వెబ్ సైట్ మరియు మొబైల్ అప్లికేషన్లలో లభ్యమయ్యే వివిధ ఫీచర్లతో సహా మీ వినియోగాన్ని నియంత్రిస్తుంది, దీనిని సమిష్టిగా "ప్లాట్ఫారమ్" అని సూచిస్తారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తెచ్చింది మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ("షేర్‌చాట్", "కంపెనీ", "మేము", "మనము" మరియు "మా"), అను భారతదేశ చట్టాల ప్రకారం స్థాపించబడిన ఒక ప్రైవేట్ సంస్థ మరియు దీని నమోదిత కార్యాలయం, నార్త్ టవర్ స్మార్ట్‌వర్క్స్, వైష్ణవి టెక్ పార్క్, సర్వే సంఖ్య 16/1 & సంఖ్య 17/2 అంబలిపుర గ్రామం, వర్తుర్ హోబ్లీ, బెంగళూరు అర్బన్, కర్ణాటక – 560103లో ఉంది. "మీరు" మరియు "మీ" అనే పదాలు ప్లాట్‌ఫారమ్ యొక్క వినియోగదారుని సూచిస్తాయి.
ఈ మార్గదర్శకాలను, షేర్‌చాట్ యొక్క వినియోగ నిబంధనలు, షేర్‌చాట్ గోప్యతా పాలసీ, మరియు షేర్‌చాట్ కుకీ పాలసీ (సమిష్టిగా, "నిబంధనలు")తో కలిపి చదవాలి. ఈ మార్గదర్శకాల్లో ఉపయోగించిన క్యాపిటల్ పదాలకు, నిబంధనలో వాటి అర్ధాలు ఉంటుంది.
మేము ఈ మార్గదర్శకాలను కాలానుగుణంగా మార్చవచ్చని మరియు అలా చేసే హక్కు మాకు ఉందని దయచేసి గమనించండి. ఈ మార్గదర్శకాల యొక్క నవీకరించబడిన సంస్కరణ ఇక్కడ అందుబాటులో ఉంది మరియు ప్లాట్‌ఫారమ్ విధానాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
మా ప్లాట్‌ఫారమ్ భారతదేశం అంతటా మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల ప్రజలతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. మేము సృష్టించిన కమ్యూనిటీ వైవిధ్యమైనది మరియు వివిధ రకాల కంటెంట్‌ను స్వీకరిస్తుంది, కానీ ప్లాట్‌ఫారమ్ వివిధ రకాల ప్రేక్షకులచే ఉపయోగించబడుతుంది, ఇందులో మైనర్లు మరియు యువకులు కూడా ఉండవచ్చు. అందువల్ల, మా వినియోగదారులందరూ ప్రామాణిక పద్ధతులను అనుసరిస్తున్నారని నిర్ధారించడానికి మరియు మిమ్మల్ని మీరు సృజనాత్మకంగా వ్యక్తీకరించి సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించడానికి, మేము ప్లాట్‌ఫారమ్ వాడకాన్ని నియంత్రించే కఠినమైన మార్గదర్శకాలు మరియు పరిమితులను ఏర్పాటు చేశాము.
కంటెంట్ మార్గదర్శకాలు
మా ప్లాట్‌ఫారమ్‌లో నిషేధించబడిన మరియు మా మార్గదర్శకాలు మరియు వర్తించే భారతీయ చట్టాలు రెండింటినీ ఉల్లంఘించే కంటెంట్‌ను మేము సక్రియంగా తీసివేస్తాము. అటువంటి కంటెంట్ మా దృష్టికి వస్తే, మేము దానిని తీసివేయవచ్చు లేదా వినియోగదారు ఖాతాలకు ప్రాప్యతను పరిమితం చేయవచ్చు. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే ఏదైనా కంటెంట్ మీకు కనిపిస్తే, దానిని నివేదించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. సృష్టికర్త యొక్క ఉద్దేశ్యం ముఖ్యం. సృజనాత్మక స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము, అయినప్పటికీ, అసౌకర్యాన్ని కలిగించే, ద్వేషపూరిత ప్రసంగం మరియు దుర్వినియోగంగా పరిగణించబడే వాటిని వ్యాప్తి చేయడం, హింస మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించడం లేదా మోసపూరితమైన మరియు/లేదా సృష్టికర్త లేదా కళాకారుడి పర్యావరణ వ్యవస్థకు ఆటంకం కలిగించే కంటెంట్‌ను మేము అనుమతించము.
a. వర్తించే చట్టాలకు కట్టుబడి ఉండటం
పరిమితి లేకుండా, మా ప్లాట్‌ఫారమ్‌లో మీరు అప్‌లోడ్ చేసిన, పోస్ట్ చేసిన, వ్యాఖ్యానించిన లేదా పంచుకున్న కంటెంట్‌తో సహా మొత్తం కంటెంట్, భారతీయ న్యాయ సంహిత, 2023, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 మరియు అటువంటి చట్టాల కింద చేసిన అన్ని నియమాలు మరియు సవరణలతో సహా భారతదేశ చట్టాలకు కట్టుబడి ఉండాలి. వర్తించే చట్టాలను ఉల్లంఘించిన సందర్భాల్లో మేము చట్టపరమైన అధికారులు మరియు చట్ట అమలు యంత్రాంగాలకు సహకరిస్తాము.
భారతదేశం యొక్క ఐక్యత, సమగ్రత, రక్షణ, భద్రత లేదా సార్వభౌమాధికారం, విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు లేదా పబ్లిక్ ఆర్డర్ లేదా హింసను ప్రేరేపించే కంటెంట్‌ను మీరు అప్‌లోడ్ చేయకూడదు, పోస్ట్ చేయకూడదు, వ్యాఖ్యానించకూడదు లేదా పంచుకోకూడదు. మీరు వేరు దేశాన్ని అవమానించే, ఏదైనా నేరాన్ని ప్రేరేపించే లేదా ఏదైనా నేరాల విచారణను నిరోధించే కంటెంట్‌ను పోస్ట్ చేయకూడదు లేదా వాటితో సంబంధం కలిగి ఉండకూడదు.
b. నగ్నత్వం మరియు అశ్లీలత
కళాత్మక, డాక్యుమెంటరీ, విద్యా, ప్రజా అవగాహన, హాస్యం లేదా వ్యంగ్య ప్రయోజనాలకు ఉపయోగపడే పరిమిత లైంగిక చిత్రాలు ఉన్న కంటెంట్‌ను మేము అనుమతిస్తాము. ఈ క్రింది వాటిని కలిగి ఉన్న కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లో నిషేధించబడింది మరియు ఈ మార్గదర్శకాల కఠినమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుంది:
- అశ్లీలమైన, లైంగిక అసభ్యకరమైన, నగ్నమైన కంటెంట్ లేదా ప్రైవేట్ భాగాలను (లైంగిక అవయవాలు, ఆడవారి వక్షోజాలు మరియు చనుమొనలు, పిరుదులు) మరియు/లేదా లైంగిక కార్యకలాపాలను ప్రదర్శించే చిత్రాలు/వీడియోలు;
- శారీరక గోప్యతతో సహా మరొకరి గోప్యతకు హాని కలిగించే కంటెంట్;
- రాజీపడే భంగిమల్లో ఉన్న వ్యక్తుల వీడియోలు లేదా చిత్రాలు లేదా లైంగిక చర్యలు, భ్రాంతులు, శృంగార ఉద్దేశం లేదా లైంగిక ప్రేరేపణను వర్ణించే కంటెంట్;
- శృంగారం లేదా ప్రతీకారం తీర్చుకునే అశ్లీలత;
- మృగప్రాయత్వము లేదా జూఫిలియా(జంతువులపై అసాధారణమైన ప్రేమ);
- ఏదైనా వ్యక్తిని దోపిడీ చేసే లేదా అపాయం కలిగించే కంటెంట్ (ఉదాహరణకు, వ్యభిచారం లేదా వెంబడించడం లేదా ఒక వ్యక్తిని దోపిడీ చేయడం కోసం ఫోన్ సంఖ్యల జాబితా లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం);
- పెడోఫిలియా లేదా పిల్లల అశ్లీలతకు సంబంధించిన కంటెంట్ (పరిమితి లేకుండా, సృష్టి, ప్రచారం, కీర్తి, ప్రసారం, లేదా పిల్లల అశ్లీలతను బ్రౌజింగ్ చేయడం) లేదా పిల్లల లైంగిక వేధింపుల చిత్రాలు మరియు పెడోఫిలియా లేదా పిల్లల లైంగిక దోపిడీని వర్ణించే, ప్రోత్సహించే లేదా ఎవరైనా ఇతర పిల్లలకు సంబంధించిన హానికర కంటెంట్. ఇది పిల్లలపై లైంగిక వేధింపులను కలిగి ఉండే ఏదైనా కంటెంట్‌ను కలిగి ఉంటుంది, అలాగే శబ్దం లేదా సంజ్ఞల ద్వారా, లేదా ఏదైనా వస్తువు లేదా శరీరం యొక్క భాగాన్ని ప్రదర్శించడం వంటి ఉద్దేశ్యంతో పిల్లలకి కనిపించాలనే లేదా వినిపించాలనే ఉద్దేశ్యంతో, ప్లాట్‌ఫారమ్‌లో గలదు;
- అసభ్యకరమైన, అనైతికమైన లేదా అత్యాచారం, లైంగిక అభ్యంతరం, ఏకాభిప్రాయం లేని కార్యకలాపాలు మరియు వేధింపులకు సంబంధించిన కంటెంట్.
c. వేధింపులు లేదా బెదిరింపులు
మా ప్లాట్‌ఫారమ్‌లో ఏదైనా వేధింపులు లేదా బెదిరింపులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భావోద్వేగం లేదా మానసిక క్షోభ కలిగించకుండా, భయపడకుండా తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛను మా వినియోగదారులకు అందించాలని మేము భావిస్తున్నాము. మీరు చిల్లరతనంగా లేదా బాధించేదిగా భావించే ఏదైనా కంటెంట్‌ను విస్మరించమని మేము మిమ్మల్ని కోరుతున్నాము. దీనితో పాటు, మరొక వ్యక్తిని వేధించే లేదా ఎవరినైనా కించపరిచే లేదా అవమానపరిచే ఉద్దేశంతో ఉన్న ఏదైనా కంటెంట్‌ను నివేదించమని కూడా మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.
ఈ మార్గదర్శకాల ఉల్లంఘనకు సంబంధించిన కంటెంట్ ఉదాహరణలు దిగువ ఇవ్వబడ్డాయి. దయచేసి ఇది వేధింపులు/బెదిరింపుల పరిధిలోకి వచ్చే నిరోధిత కార్యకలాపాల పూర్తి జాబితా కాదని గమనించండి. ఈ మార్గదర్శకాలు మరియు నిబంధనలను ఉల్లంఘించే ఇతర కార్యకలాపాలు ఉండవచ్చు:
- దుర్వినియోగ భాష లేదా శాపనార్థ పదాలు, మార్ఫింగ్ చేసిన చిత్రాలు మరియు/లేదా హానికరమైన నమోదులను పోస్ట్ చేయడం.
- ఎవరినైనా వారి లింగం, జాతి, కులం, రంగు, వైకల్యాలు, మతం, లైంగిక ప్రాధాన్యతలు మరియు/లేదా లైంగికంగా కించపరచడం లేదా లైంగిక దుష్ప్రవర్తనలో పాల్గొనడం, అవమానించడం లేదా వేధించడం ఈ ప్లాట్‌ఫారమ్‌లో అనుమతించబడదు. అదేవిధంగా, సాధారణంగా లేదా పైన పేర్కొన్న కంటెంట్ ఆధారంగా ఏదైనా వ్యక్తిని బలవంతం చేయడం లేదా బ్లాక్‌మెయిల్ చేయడం వంటివి ఖచ్చితంగా నిషేధించబడింది.
- ఎవరైనా మిమ్మల్ని వారి ఖాతా నుండి బ్లాక్ చేస్తే, దయచేసి వేరే ఖాతా నుండి వారిని సంప్రదించడానికి ప్రయత్నించవద్దు. ఒక వినియోగదారు ప్లాట్‌ఫారమ్‌లో మిమ్మల్ని కలవకూడదని అనుకుంటే, దయచేసి వారి భావనను గౌరవించండి.
- ఒక వ్యక్తి యొక్క ఏదైనా చిత్రం లేదా సమాచారాన్ని వారి సమ్మతి లేకుండా, వారిని వేధించడం, బాధపెట్టడం లేదా ప్రమాదానికి గురిచేసే ఉద్దేశ్యంతో ఇతరులకు పంపడం.
- ఆర్థిక లాభం కోసం ఎవరినైనా వేధించే ఉద్దేశ్యంతో తప్పుడు సమాచారం పోస్ట్ చేసి వారికి మానసిక, శారీరక హాని మరియు గాయం కలిగించడం.
ఏదేమైనప్పటికీ, వార్తలలో ప్రదర్శించబడిన లేదా ఎక్కువ మంది పబ్లిక్ ప్రేక్షకులు గల వ్యక్తుల గురించి క్లిష్టమైన చర్చలు మరియు సమాలోచనలు ఉంటే, మేము దానిని నిబంధనలు మరియు ఈ మార్గదర్శకాలకు లోబడి అనుమతించవచ్చు.
d. మేధో సంపత్తి మరియు మ్యూజిక్ గ్రంథాలయం యొక్క వినియోగం
మేము మేధో సంపత్తి హక్కులను కాపాడాలని లక్ష్యంగా పెట్టుకున్నాము మరియు అటువంటి హక్కుల ఉల్లంఘనలను తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణిస్తాము. సాహిత్య, సంగీత, నాటకీయ, కళాత్మక, సౌండ్ రికార్డింగ్‌లు మరియు సినిమాటోగ్రాఫిక్ పనులతో సహా మొత్తం కంటెంట్, మేధో సంపత్తి రక్షణకు లోబడి ఉంటుంది.
ప్లాట్‌ఫారమ్‌లో అసలైన కంటెంట్‌ను పోస్ట్ చేయడం మరియు అటువంటి కంటెంట్/పనులలో మేధో సంపత్తి హక్కులు గల వ్యక్తి/సంస్థ నుండి కాపీ చేయబడిన కంటెంట్‌ని పోస్ట్ చేయడం నిషేధించబడింది. మూడవ పక్షాల మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించే ఏదైనా కంటెంట్ తొలగించబడుతుంది మరియు ఈ మార్గదర్శకాలను పదే పదే ఉల్లంఘించే వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. మీరు ప్లాట్‌ఫారమ్‌లో నుండి అటువంటి కంటెంట్‌ను తిరిగి ఇతరులతో పంచుకోకూడదు, దయచేసి కంటెంట్ యొక్క ప్రామాణికమైన మూలాన్ని తెలిపే ఎటువంటి అట్రిబ్యూషన్‌లు, వాటర్‌మార్క్‌లు లేదా అసలు శీర్షికలను తీసివేయవద్దు. దీనికి అదనంగా, దయచేసి అవసరమైన అనుమతులను తీసుకోండి మరియు వారి పేరు మరియు/లేదా అసలు మూలాన్ని పేర్కొనడం ద్వారా అటువంటి కంటెంట్‌లో మేధో సంపత్తి హక్కులను కలిగి ఉన్న మీ తోటి వినియోగదారులు లేదా ఏదైనా ఇతర సంస్థ/వ్యక్తికి తగిన క్రెడిట్ ఇవ్వండి.
ప్లాట్‌ఫారమ్‌లో కంటెంట్‌ని సృష్టించడానికి మీరు ఉపయోగించే మా మ్యూజిక్ లైబ్రరీ (“గ్రంథాలయం”) ద్వారా మేము ఆడియో ట్రాక్‌లను అందించవచ్చు. దీనిని వ్యక్తిగత మరియు వాణిజ్యేతర ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. మీరు మీ ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేయడానికి ఆడియో/సంగీతాన్ని ఉపయోగించాలనుకుంటే, దయచేసి ప్రత్యేక అనుమతులు మరియు అవసరమైన అన్ని హక్కులను పొందండి. మీరు మా లైబ్రరీ నుండి పొందుపరచగల అటువంటి ఆడియో/సంగీతం యొక్క నిడివి మారుతూ ఉంటుంది మరియు పరిమిత వ్యవధిని మించకూడదు.
దయచేసి ఈ మార్గదర్శకాలు లేదా ఏదైనా ఇతర వర్తించే ప్లాట్‌ఫారమ్ విధానాలను ఉల్లంఘించేలా ఆడియో/సంగీతాన్ని వాడవద్దు. మీ కంటెంట్‌లోని ఆడియోను నిలిపివేయడానికి, కంటెంట్‌ను తీసివేయడానికి లేదా ఈ మార్గదర్శకాలు లేదా వర్తించే చట్టాలకు విరుద్ధంగా ఉన్నట్లయితే దానిని పంచుకోవడం/యాక్సెస్‌ని పరిమితం చేసే హక్కును మాకు గలదు. మా లైబ్రరీలో అందుబాటులో ఉన్న సంగీతం నిరంతరం మారుతూ ఉంటుంది మరియు ప్రస్తుతం మా లైబ్రరీలో అందుబాటులో ఉన్న నిర్దిష్ట సంగీతం భవిష్యత్తులో అందుబాటులో ఉండకపోవచ్చు. అటువంటి చర్యల కారణంగా (సంగీతం కోల్పోవడం, సంగీతాన్ని నిలిపివేయడం లేదా తీసివేయడం మొదలైనవి) మీకు కలిగే ఎటువంటి నష్టానికి లేదా హానికి మేము బాధ్యత వహించము.
వినియోగదారులు మా లైబ్రరీలో నుండి కాకుండా వెలుపలి నుండి ఆడియోతో చేసిన కంటెంట్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. అటువంటి ఆడియో మూడవ పక్షం యొక్క కాపీరైట్‌ను ఉల్లంఘిస్తుందని మాకు తెలిసిన సందర్భంలో, మేము ఆ ఆడియోను కలిగి ఉన్న కంటెంట్‌ను మ్యూట్ చేయవచ్చు లేదా తీసివేయవచ్చు.
వర్తించే చట్టాల ప్రకారం అటువంటి వినియోగం 'న్యాయమైన ఉపయోగం'గా పరిగణించబడే నిర్దిష్ట పరిస్థితులలో మీరు వేరొకరు కాపీరైట్ పొందిన పనిని ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, విమర్శ, వ్యాఖ్యానం, అనుకరణ, వ్యంగ్యం లేదా బోధన కోసం ఉపయోగించడం న్యాయపరమైన ఉపయోగంగా పరిగణించబడుతుంది. న్యాయపరమైన ఉపయోగం గురించి మరింత తెలుసుకోవడానికి, మీరు https://copyright.gov.in/Exceptions.aspxని సందర్శించవచ్చు. అయినప్పటికీ, మీ కంటెంట్ న్యాయపరమైన ఉపయోగ మినహాయింపుల క్రింద వర్తించబడుతుందని మీరు భావించినప్పుడు కూడా సాధారణంగా అవసరమైన అనుమతులను తీసుకోవడం మరియు తగిన క్రెడిట్ ఇవ్వడం మంచిది.
e. హింస
హింస మరియు బాధలను ప్రోత్సహించడం, హింసను ప్రేరేపించడం లేదా హింసకు పాల్పడే ఉద్దేశాన్ని వ్యక్తీకరించడం లేదా శారీరక హింస లేదా జంతు హింసను వర్ణించే చిత్రాలు లేదా వీడియోలతో సహా గ్రాఫిక్ ద్వారా మా వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగించే మొత్తం కంటెంట్ హింసను సూచిస్తుంది. జంతువుల పట్ల క్రూరత్వం, తీవ్రమైన నిర్లక్ష్యం, దుర్వినియోగం లేదా హానిని కీర్తించే లేదా ప్రోత్సహించే కంటెంట్ కూడా నిషేధించబడింది.
హింసాత్మకంగా పరిగణించబడే మరియు ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్ యొక్క కొన్ని ఉదాహరణలు క్రింద అందించబడ్డాయి:
- ప్రమాదకరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించే కంటెంట్;
- తీవ్రవాదం, వ్యవస్థీకృత హింస, ద్వేషపూరిత ప్రచారం లేదా నేర కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తులు, సమూహాలు లేదా నాయకులను ప్రశంసించే లేదా స్మారకపరిచే కంటెంట్;
- తీవ్రవాద సంస్థలు, నేర సంస్థలు లేదా హింసాత్మక తీవ్రవాద సమూహాలచే నిర్వహించబడే చర్యలను సమర్థించే లేదా అటువంటి సంస్థల కార్యకలాపాలకు భౌతిక మద్దతు కోరే కంటెంట్;
- తీవ్రవాద సంస్థలు, నేర సంస్థలు లేదా హింసాత్మక తీవ్రవాద సమూహాల కోసం వ్యక్తులను పనిలోకి తీసుకునేలా ప్రోత్సహించే కంటెంట్;
- అటువంటి విషయం తరపున వ్యవహరించడానికి వినియోగదారులను ప్రోత్సహించే కంటెంట్,
- పేలుడు పదార్థాలు లేదా తుపాకీలను ఎలా తయారు చేయాలి లేదా ఉపయోగించాలి అనే దానిపై సూచనలను అందించే కంటెంట్.
ప్లాట్‌ఫారమ్‌లో హింసకు సంబంధించిన విద్యా, వార్తలు లేదా సమాచార కంటెంట్ అనుమతించబడవచ్చు. హింసను ప్రేరేపించని లేదా వ్యక్తులపై హింసకు పాల్పడే ఉద్దేశాన్ని వ్యక్తం చేయని వ్యక్తులు లేదా సమూహాలపై విమర్శలు అనుమతించబడవచ్చు. ఈ మార్గదర్శకాలకు లోబడి కల్పిత సెటప్‌లు లేదా యుద్ధ కళల రూపంలో ప్లాట్‌ఫారమ్‌లో హింసాత్మక కంటెంట్ అనుమతించబడవచ్చు.
ఎవరైనా సమీపిస్తున్న ప్రమాదంలో ఉన్నారని మీరు భావిస్తే, మీరు మీ స్థానిక చట్టాన్ని అమలు చేసే అధికారులను సంప్రదించి, పరిస్థితిని వీలైనంత త్వరగా నివేదించాలి.
f. ద్వేషపూరిత ప్రసంగం మరియు ప్రచారం
హింసను ప్రోత్సహించే కంటెంట్ లేదా ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంపై హింసాత్మక ప్రవర్తన లేదా శత్రుత్వాన్ని ప్రేరేపించే కంటెంట్ లేదా ఏదైనా నిర్దిష్ట మతం, జాతి, కులం, సమూహమును భయపెట్టడం(వీటితో పాటు కానీ వీటికి పరిమితం కాకుండా), లేదా సంఘం, జాతీయత, వైకల్యం (శారీరక లేదా మానసిక), వ్యాధి లేదా లింగం ఆధారంగా కించపరచడం లేదా గాయపరచడం వంటి విషయాలను లక్ష్యంగా చేసుకోవడం నిషేధించబడింది. మతం, కులం, జాతి, సంఘం, లైంగిక ధోరణి లేదా లింగ గుర్తింపు ఆధారంగా మరియు వాటికి మాత్రమే పరిమితం కాకుండా ద్వేషాన్ని సృష్టించే లేదా ద్వేషం లేదా ద్వేషపూరిత ప్రచారాన్ని సృష్టించడానికి లేదా వ్యాప్తి చేయడానికి ఉద్దేశించిన ఏదైనా కంటెంట్ నిషేధించబడింది. పైన పేర్కొన్న లక్షణాల ఆధారంగా హింసను సమర్థించే ఉద్దేశ్యంతో లేదా ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహాన్ని ఏ కోణంగానైనా తక్కువ చేయడం లేదా ప్రతికూల అర్థాలతో సూచించబడే వివక్షను వ్యాపింపజేసే కంటెంట్‌ను మేము సహించము. హింసను ప్రేరేపించే ఉద్దేశ్యంతో మతం లేదా కులం ప్రాతిపదికన వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే కంటెంట్ కూడా నిషేధించబడింది.
దేవుళ్లు, మత దేవతలు, చిహ్నాలు లేదా ఏదైనా మతం యొక్క చిహ్నాలను అవమానించేలా, మా వినియోగదారుల మధ్య ఆగ్రహాన్ని కలిగించే మరియు వారిని ప్రతికూలంగా ప్రభావితం చేసే సిద్ధాంతాలు లేదా ద్వేషపూరిత భావజాలాలను ప్రచురించడం వంటి దాహక వ్యాఖ్యానాలను నివారించండి. ప్లాట్‌ఫారమ్‌లో అటువంటి కంటెంట్‌ను పోస్ట్ చేయకుండా ఉండటానికి, ఈ సమస్యల గురించి అవగాహన పెంచే లేదా వాటిని నివారించాలనే ఉద్దేశంతో కూడిన కంటెంట్‌ను మేము అనుమతించవచ్చు.
g. దుర్వినియోగం, స్వీయ గాయం లేదా ఆత్మహత్య
ఆత్మహత్య, స్వీయ గాయం, హాని లేదా అటువంటి ధోరణులను వర్ణించే లేదా ప్రోత్సహించే మరియు ప్రమాదకరమైన కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని ప్రోత్సహించే కంటెంట్‌ను మేము అనుమతించము. పిల్లలు లేదా పెద్దలు ఒక వ్యక్తిని శారీరక, మానసిక, లేదా లైంగిక దుర్వినియోగం, లేదా నిర్లక్ష్యం చేసే ఏదైనా కంటెంట్‌ను పోస్ట్ చేయడం ఖచ్చితంగా మా ప్లాట్‌ఫారమ్‌లో నిషేధించబడింది. స్వీయ-హానిని ప్రదర్శించే కంటెంట్, స్వీయ-గాయం లేదా ఆత్మహత్యను కీర్తించడం లేదా ఏదైనా మార్గాల ద్వారా స్వీయ-హాని ఎలా చేసుకోవాలో సూచనలను కూడా పేర్కొనడం నిషేధించబడింది. ఇంకా, మానసిక/శారీరక దుర్వినియోగం, స్వీయ గాయం, గృహహింస లేదా మరేదైనా హింసకు గురైన వారిని గుర్తించే, ట్యాగ్ చేసే, అవమానించే లేదా అపహాస్యం చేసే కంటెంట్ నిషేధించబడింది.
అటువంటి తీవ్రమైన సమస్యలకు గురవుతున్న వారికి మద్దతు, సహాయం మరియు ఉపశమనాన్ని అందించడానికి ఉద్దేశించిన కంటెంట్‌ను మేము అనుమతిస్తాము. అటువంటి కంటెంట్‌ను పోస్ట్ చేసే ఉద్దేశంతో అవసరమైన వారికి మానసిక మద్దతును అందించగల వారి అనుభవాలను పంచుకోవడానికి కూడా మేము వినియోగదారులను అనుమతిస్తాము.
h. చట్టవిరుద్ధ కార్యకలాపాలు
చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను సమర్థించే లేదా ప్రోత్సహించే కంటెంట్ పట్ల మాకు సహనం అస్సలు ఉండదు.
వ్యవస్థీకృత నేరాలు, నేర కార్యకలాపాలు, ప్రచారం, అమ్మకం లేదా ఆయుధాలు, తుపాకీలు మరియు పేలుడు పదార్థాలు, హింస లేదా ఉగ్రవాద కార్యకలాపాలు లేదా కిడ్నాప్ లేదా అపహరణంకు సంబంధించిన కంటెంట్‌ను లేదా వాటికి మద్దతుగా ఉండే కంటెంట్‌ను మేము నిషేధిస్తాము. చట్టవిరుద్ధమైన వస్తువులు లేదా సేవలు, నియంత్రిత వస్తువులు, మందులు మరియు నియంత్రిత పదార్ధాల విక్రయం మరియు లైంగిక సేవలను కోరడం ఖచ్చితంగా నిషేధించబడింది. మీరు ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేసే లేదా పంచుకునే ఏదైనా కంటెంట్ భారత జాతీయ జెండాతో సహా రక్షిత జాతీయ చిహ్నాలను గౌరవించాలి.
పిల్లలను వేధించే, హానికరమైన లేదా దుర్వినియోగం చేసే కంటెంట్‌ను మేము అనుమతించము. వినియోగదారులు మనీలాండరింగ్ లేదా జూదానికి సంబంధించి లేదా వాటిని ప్రోత్సహించే కంటెంట్‌ను పోస్ట్ చేయకూడదు. ట్యుటోరియల్‌లు లేదా సూచనలను ప్రదర్శించే కంటెంట్‌ను పోస్ట్ చేయడం లేదా నేర కార్యకలాపాలలో పాల్గొనడం, బాంబులను తయారు చేయడం లేదా డ్రగ్స్‌ను ప్రోత్సహించడం లేదా తయారు చేయడం లేదా వాటిని వ్యాపారం చేయడం వంటి చట్టవిరుద్ధమైన మరియు నిషేధించబడిన కార్యకలాపాల గురించి కంటెంట్‌ని పోస్ట్ చేయడం నుండి వినియోగదారులు నిషేధించబడ్డారు. భారత ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ప్రకటించిన వస్తువులు మరియు సేవలకు సంబంధించిన ఏదైనా లావాదేవీ లేదా బహుమతులను అభ్యర్థించడానికి లేదా వాటిని సులభతరం చేయడానికి మా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించవద్దు.
వేరొక వ్యక్తి (మీ కుటుంబం, స్నేహితులు, ప్రసిద్ధ వ్యక్తులు, బ్రాండ్ లేదా ఎవరైనా ఇతర వ్యక్తులు/సంస్థలు వంటివి) వలె నటించడం మరియు వ్యక్తిగత లేదా ఆర్థిక లాభం కోసం మా ప్లాట్‌ఫారమ్‌లో తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని పంపిణీ చేయడం మోసపూరితంగా పరిగణించబడుతుంది.
కంప్యూటర్ లేదా సాఫ్ట్‌వేర్ వైరస్‌లు, మాల్వేర్ లేదా ఏదైనా ఇతర కంప్యూటర్ కోడ్, ఫైల్ లేదా ఏదైనా కంప్యూటర్ వనరు యొక్క కార్యాచరణకు అంతరాయం కలిగించడానికి, నాశనం చేయడానికి లేదా పరిమితం చేయడానికి రూపొందించబడిన ప్రోగ్రామ్‌లు గల కంటెంట్‌ని ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేయకూడదు.
ప్లాట్‌ఫారమ్‌లో పైన పేర్కొన్నవి పూర్తిగా నిషేధించబడిన చట్టవిరుద్ధ కార్యకలాపాల జాబితా కాదని దయచేసి గమనించండి మరియు ఈ మార్గదర్శకాలు మరియు నిబంధనలను ఉల్లంఘించే వేరే కార్యకలాపాలు ఉండవచ్చు.
i. ఏకీభవించబడని (వ్యక్తిగత) కంటెంట్
వేరొక వ్యక్తి వలె నటించే కంటెంట్ నిషేధించబడింది. వ్యక్తిగత కంటెంట్ లేదా డేటా లేదా మరొక వ్యక్తి యొక్క సమాచారాన్ని పోస్ట్ చేయడం లేదా దుర్వినియోగం చేయడం నిషేధించబడింది. అటువంటి కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి స్పష్టమైన సమ్మతి ఇవ్వని వ్యక్తుల చిత్రాలు లేదా వీడియోలతో సహా, వారి అనుమతి లేదా సమ్మతి లేకుండా వ్యక్తిగత లేదా సన్నిహిత ఫోటోలు లేదా వీడియోలను పోస్ట్ చేయవద్దు. ఇతరుల గోప్యతకు భంగం కలిగించే కంటెంట్‌ను పోస్ట్ చేయవద్దు. వేరొక వ్యక్తికి సంబంధించిన కంటెంట్ మరియు వినియోగదారుకు ఎటువంటి హక్కు లేని కంటెంట్ అనుమతించబడదు.
వేరొక వ్యక్తి యొక్క సంప్రదింపు సమాచారం, పాస్‌వర్డ్‌లు, చిరునామా, ఆర్థిక సమాచారం, లైంగిక ధోరణి, బయోమెట్రిక్ సమాచారం, ప్రభుత్వ గుర్తింపు పత్రాలైన ఆధార్ వివరాలు, పాస్‌పోర్ట్ సమాచారం, భౌతిక ఆరోగ్య సమాచారం వంటి వాటితో సహా, వర్తించే చట్టాల ప్రకారం నిర్వచించబడిన వ్యక్తిగత డేటా లేదా సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడం, శారీరక మరియు మానసిక ఆరోగ్య స్థితి, లైంగిక లేదా సన్నిహిత చిత్రాలు మరియు వీడియోలు లేదా అలాంటి సమాచారాన్ని వెల్లడించమని లేదా ఉపయోగించమని ఎవరినైనా బెదిరించడం వంటి విషయాలు వేధింపుగా పరిగణించబడుతుంది మరియు మా ప్లాట్‌ఫారమ్‌లో అలాంటి కార్యకలాపాలు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి.
j. స్పామ్
కంటెంట్ యొక్క మూలం గురించి వినియోగదారులను తప్పుదారి పట్టించే కంటెంట్, తప్పుడు ప్రకటనలు, మోసపూరిత లేదా తప్పుదారి పట్టించే ప్రాతినిధ్యాలను ప్రదర్శించడం లేదా ప్రచారం చేయడం మరియు భద్రతా ఉల్లంఘనలు స్పామ్ పరిధిలోకి వస్తాయి మరియు అవి నిషేధించబడ్డాయి. అటువంటి కంటెంట్‌ని వాణిజ్య లాభం కోసం పోస్ట్ చేసినప్పుడు, అది వాణిజ్య స్పామ్‌గా పరిగణించబడుతుంది. స్పామ్ అనేది ప్లాట్‌ఫారమ్ సజావుగా పని చేయడంలో అంతరాయం కలిగిస్తుంది మరియు ఇతర వినియోగదారులకు పంచుకోవడం మరియు కనెక్ట్ అవ్వడాన్ని నిరోధిస్తుంది. మీరు పంచుకునే కంటెంట్ ప్రామాణికమైనదిగా ఉండాలి మరియు వ్యక్తులు ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయడానికి సురక్షితమైనదిగా మరియు విశ్వసనీయ వాతావరణాన్ని సృష్టించేదిగా ఉండటం చాలా ముఖ్యం. వీక్షకులను ఇబ్బంది పెట్టాలని లేదా స్పామ్ కంటెంట్‌ని ప్రచారం చేయాలని, వాణిజ్యపరంగా లేదా ఇతరత్రా వస్తువులు/సేవలను విక్రయించాలనే ఉద్దేశంతో ఒకే కంటెంట్‌ని అనేక సార్లు పోస్ట్ చేయడం నిషేధించబడింది. ట్రాఫిక్‌ని సృష్టించడానికి లేదా అనుచరులు, ఇష్టాలు, వీక్షణలు, వ్యాఖ్యలు మరియు షేర్‌లను పెంచడానికి కృత్రిమ మరియు మోసపూరిత మార్గాలను ఉపయోగించవద్దు.
ఒకవేళ మీరు మీ వస్తువులు లేదా సేవలను ప్రచారం చేయాలనుకుంటే, దయచేసి ప్రామాణికమైన పద్ధతిలో చేయండి.
ఒక రకమైన కంటెంట్‌ను పేర్కొనే లింక్‌ని చూపి, అందులో వేరొక తప్పుదారి పట్టించే లేదా మోసపూరిత కంటెంట్‌ని చూపే లింక్‌లను పోస్ట్ చేయవద్దు. వేరొక వ్యక్తి యొక్క గోప్యతను (ఉదాహరణకు, ఫిషింగ్ దాడి) రాజీ చేయడానికి ఉద్దేశించిన హానికరమైన కంటెంట్ (మాల్వేర్ వంటివి) గల లింక్‌ను కలిగి ఉన్న కంటెంట్‌ను పోస్ట్ చేయవద్దు.
k. తప్పుడు సమాచారం
మా ప్లాట్‌ఫారమ్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.
తప్పుదారి పట్టించే లేదా తెలిసి ఉద్దేశపూర్వకంగా ఏదైనా తప్పుడు సమాచారం లేదా తప్పుడు సమాచారాన్ని కమ్యూనికేట్ చేసే కంటెంట్ లేదా అవాస్తవమైన సమాచారం నిషేధించబడింది. ఇంకా, వినియోగదారులను లేదా సాధారణ ప్రజలను పెద్దగా తప్పు దోవ పట్టించే ఉద్దేశ్యంతో బూటకాలను లేదా నకిలీ ప్రచారం అనేది నిషేధించబడింది. మేము ఇప్పటికే ఉన్న వార్తలను అతిశయోక్తి చేసే కంటెంట్‌ను పోస్ట్ చేయడాన్ని కూడా నిషేధిస్తాము.
ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులను తప్పుదారి పట్టించే కంటెంట్‌ను లేదా సమాచారాన్ని రూపొందించడానికి ఒక మార్గాన్ని సృష్టించడానికి ప్రయత్నించే లేదా పరువు నష్టం కలిగించే, అపవాదు లేదా ఒకరి ప్రతిష్టను దెబ్బతీసే లేదా తప్పు సమాచారం ఆధారంగా వారి ఆర్థిక లేదా రాజకీయ స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేసే మరియు మొదలైన వాటిని అనుమతించము మరియు వాటిని మేము ప్రోత్సహించము. నకిలీ వార్తల ముప్పును ఎదుర్కోవడానికి మరియు మా ప్లాట్‌ఫారమ్‌లో వాస్తవంగా తప్పుడు సమాచారాన్ని పరిమితం చేయడానికి మేము మూడవ పార్టీ ద్వారా వాస్తవ తనిఖీ(ల)ని చేస్తాము. వినియోగదారులు మా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసిన కంటెంట్‌కు జవాబుదారీగా ఉంటారు. ప్లాట్‌ఫారమ్‌లో మీరు పోస్ట్ చేసే కంటెంట్ ప్రామాణికమైనదని మరియు విశ్వసనీయమైన మరియు ధృవీకరించదగిన మూలం నుండి వచ్చినదని మీరు వీలైనంత వరకు నిర్ధారించుకోవాలి.
దయచేసి హాని కలిగించే, ప్రజా భద్రతను ప్రతికూలంగా ప్రభావితం చేసే లేదా పబ్లిక్ ఆర్డర్‌కు కారణమయ్యే మానిప్యులేట్ చేసిన మీడియాను (టెక్స్ట్, ఆడియో మరియు వీడియోతో సహా) ఉపయోగించే కంటెంట్‌ను అప్‌లోడ్ చేయవద్దు లేదా పంచుకోవద్దు. క్రింద ఉన్నవి మానిప్యులేట్ మీడియాగా పరిగణించబడతాయి:
- వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలకు హాని కలిగించడం;
- ఎన్నికల లేదా పౌర ప్రక్రియల సమగ్రతకు హాని కలిగించడం లేదా బెదిరించడం,
- వ్యక్తులు లేదా సంస్థలను మోసం చేసే లక్ష్యం;
- మతం, జాతి, లింగం, భాష ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం; మొదలైనవి లేదా
- ఉద్దేశపూర్వకంగా మరియు దురుద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను రెచ్చగొట్టడం.
మానిప్యులేట్ చేయబడిన మీడియా అనేది సింథటిక్ లేదా తప్పుడు కంటెంట్‌ను సూచిస్తుంది, ఇది ప్రామాణికమైనదిగా అనిపించవచ్చు మరియు వారు ఎప్పుడూ చెప్పని లేదా చేయని, కృత్రిమ మేధస్సు పద్ధతులను ఉపయోగించి లేదా ఇతరత్రా ఉత్పత్తి చేసిన వాటిని చెప్పే లేదా చేసేలా కనిపించే వ్యక్తులను కలిగి ఉంటుంది.
ఏదేమైనప్పటికీ, మేము ప్లాట్‌ఫారమ్‌లో వ్యంగ్య మరియు అధిక్షేప కంటెంట్‌ని అనుమతిస్తాము. మేము ఇతర వినియోగదారులను తప్పుదారి పట్టించని మరియు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయని కంటెంట్‌ని అనుమతిస్తాము.
కమ్యూనిటీ మార్గదర్శకాలు
మీరు మా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించినప్పుడు, మీరు కొన్ని నిబంధనలను పాటించాలని మేము ఆశిస్తున్నాము.
a. సరిగ్గా ట్యాగ్ చేయట
అన్ని పోస్ట్‌లు అత్యంత సముచితమైన ట్యాగ్‌తో ట్యాగ్ చేయబడాలి. ట్యాగ్ ప్రస్తుతం లేకపోతే, దయచేసి తదనుగుణంగా ఒక దానిని సృష్టించండి. అసంబద్ధమైన లేదా వర్తించని ట్యాగ్‌తో పోస్ట్ చేయబడిన ఏదైనా కంటెంట్ నివేదించబడితే, ఫీడ్ నుండి తీసివేయబడుతుంది.
b. ఒక విషయమునకు కట్టుబడి ఉండండి
షేర్‌చాట్ ఒక యాక్టివ్ ప్లాట్‌ఫారమ్. మీరు పోస్ట్ చేసే ఏదైనా కంటెంట్ మరియు మీరు పాల్గొనే ఏదైనా చర్చ పోస్ట్ యొక్క శీర్షిక మరియు ట్యాగ్‌లకు సంబంధించినదని నిర్ధారించుకోండి. శీర్షిక లేదా ట్యాగ్‌లకు సంబంధం లేని లేదా నిర్దిష్ట పోస్ట్‌కు అసమంజసమైన కంటెంట్ తీసివేయబడుతుంది.
c. బహుళ/నకిలీ ప్రొఫైల్‌లు
సంస్థ యొక్క నకిలీ ప్రొఫైల్‌ను సృష్టించడం [ప్రభుత్వ అధికారి లేదా సంస్థలతో సహా] మరియు వారిని వేధించే లేదా బెదిరించే ఉద్దేశ్యంతో లేదా తప్పుదారి పట్టించే లేదా మోసం చేసే విధంగా నటించడం నిషేధించబడింది. మేము కమ్యూనిటీ ప్రొఫైల్‌లు, సమాచార ప్రొఫైల్‌లు మరియు పబ్లిక్ వ్యక్తుల అభిమానుల ప్రొఫైల్‌లకు మినహాయింపులను అనుమతిస్తాము. ఇతర వినియోగదారులను తప్పుదారి పట్టించకూడదనే ఉద్దేశ్యం ఉన్నంత వరకు మరియు ప్రొఫైల్ వివరణ లేదా ప్రొఫైల్ స్టేటస్‌లో స్పష్టంగా పేర్కొనబడినంత వరకు పబ్లిక్ వ్యక్తుల వ్యంగ్య లేదా నకిలీ ఖాతాలు కూడా అనుమతించబడతాయి.
d. భద్రత మరియు రక్షణ
వేరొకరిని వేధించడం లేదా మరొక వినియోగదారుని ఉద్దేశించి పోస్ట్‌లు లేదా వ్యాఖ్యలలో దుర్భాషలాడడం నిషేధించబడింది. ఇతర వినియోగదారులకు అసౌకర్యంగా అనిపించే విషయాలను ఏదీ చేయవద్దు. మీరు ఇతర వినియోగదారులకు ప్రతికూల పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నిస్తే మీపై చర్య తీసుకోబడుతుంది.
e. చట్టపరమైన పరిణామాల పట్ల జాగ్రత్త వహించండి
మీ చర్యలకు సంబంధించి మీరే బాధ్యులు, దాని నుండి తప్పించుకోవడానికి చట్టం గురించిన అజ్ఞానం ఒక సాకుగా అంగీకరించబడదు. మా ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించడానికి, మీరు డిజిటల్ వాతావరణంలో ప్రవర్తనను నియంత్రించే చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలి. దయచేసి మా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు వర్తించే అన్ని చట్టాలను గౌరవించండి. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రదర్శించడం, ప్రోత్సహించడం, అందించడం, ప్రచారం చేయడం, కీర్తించడం లేదా అభ్యర్థించడం వంటి ఏదైనా కంటెంట్ సహించబడదు.
f. ఉల్లంఘించిన వారిపై దావా చర్యలు
ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే వారిపై మేము సత్వర చర్య తీసుకుంటాము. ఏదైనా ఖాతాపై చర్య తీసుకోవాలనే మా నిర్ణయం వినియోగదారుపై ఆధారపడి ఉంటుంది. మీ ప్రొఫైల్ ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించబడినట్లయితే, మేము తగిన చర్యలు తీసుకుంటాము మరియు ప్రొఫైల్‌కి మీ యాక్సెస్‌ని పరిమితం చేయవచ్చు. ఇతర ఖాతాలు, గుర్తింపులు, వ్యక్తిత్వాలు లేదా వేరొక వినియోగదారు ఖాతాలో ఉనికిని సృష్టించడం ద్వారా అటువంటి అమలు చర్యలను తప్పించుకునేందుకు ఏదైనా ప్రయత్నం దీర్ఘకాలిక యాక్సెస్ పరిమితులకు దారి తీస్తుంది. పునరావృత ఉల్లంఘనల విషయంలో, మేము కఠినమైన చర్యలు తీసుకోవలసి వస్తుంది మరియు మాతో నమోదు చేయడానికి వీలు లేకుండా మిమ్మల్ని మరింత పరిమితం చేయవచ్చు. మేము మా మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్‌పై కఠినమైన చర్యలను అమలు చేస్తాము మరియు ప్లాట్‌ఫారమ్ నుండి అటువంటి కంటెంట్‌ను తీసివేస్తాము.
ప్లాట్‌ఫారమ్ భద్రత
నివేదన
మీరు ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే ఏదైనా కంటెంట్ లేదా కార్యాచరణను చూసినప్పుడు, అటువంటి కంటెంట్‌ను నివేదించడానికి దయచేసి 'నివేదన' ఎంపికను నొక్కండి లేదా క్లిక్ చేయండి. మేము మీ నివేదనను సమీక్షిస్తాము. కంటెంట్ లేదా యాక్టివిటీ ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు మేము గుర్తిస్తే, మేము దానిని తీసివేసి తగిన చర్య తీసుకుంటాము. ప్లాట్‌ఫారమ్‌లోని ఏదైనా కంటెంట్ కాపీరైట్ హోల్డర్‌గా మీ హక్కులను ఉల్లంఘిస్తుందని మీరు విశ్వసిస్తే, మీరు http://copyright.sharechat.com/ మరియు అందుబాటులో ఉన్న మా హక్కుల నిర్వహణ సాధనాన్ని ఉపయోగించి కాపీరైట్ దావాను దాఖలు చేయవచ్చు మరియు అది మాకు పంపబడి తదుపరి సమీక్ష మరియు చర్య కోసం బృందం పరిశీలిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో మీకు నచ్చని కంటెంట్ ఉండవచ్చు. అయితే అది ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన్నట్లు పరిగణించబడదు. అటువంటి పరిస్థితిలో మీరు వినియోగదారులను అన్‌ఫాలో అవ్వండి లేదా బ్లాక్ చేయమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము
మధ్యవర్తిత్వ స్థితి మరియు కంటెంట్ సమీక్ష
వర్తించే చట్టాల ప్రకారం మేము మధ్యవర్తిగా ఉంటాము. మా వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసే, వ్యాఖ్యానించే, పంచుకునే లేదా చెప్పే విషయాలను మేము నియంత్రించము మరియు వారి (లేదా మీ) చర్యలకు (ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో) బాధ్యత వహించము. మీరు మా సేవల ద్వారా వాటిని యాక్సెస్ చేసినప్పటికీ, ఇతరులు అందించే సేవలు మరియు ఫీచర్‌లకు మేము బాధ్యత వహించము. మా ప్లాట్‌ఫారమ్‌లో జరిగే ఏ విషయమైనా మన భారతదేశ చట్టాల ద్వారా ఖచ్చితంగా నిర్వహించబడుతుంది మరియు మా బాధ్యత పరిమితం చేయబడుతుంది.
మీరు పోస్ట్ చేసిన దానికి మరియు మీరు చూసే వాటికి మీరే బాధ్యత వహించాలని మేము ఆశిస్తున్నాము. మా వినియోగదారులలో ఎవరైనా మీ కంటెంట్ ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు నివేదిస్తే, మేము అవసరమైన అమలు చర్యలు తీసుకోవచ్చు.
మనోవేదన ఫిర్యాదు అధికారి
డేటా భద్రత, గోప్యత మరియు ఇతర ప్లాట్‌ఫారమ్ వినియోగ సమస్యలకు సంబంధించి మీ సమస్యలను పరిష్కరించడానికి షేర్‌చాట్ ఒక మనోవేదన ఫిర్యాదు అధికారిని కలిగి ఉంది. మీరు ఈ క్రింది వాటిలో దేనిద్వారా అయినా ఫిర్యాదుల అధికారి శ్రీమతి హర్లీన్ సేథిని సంప్రదించవచ్చు:
చిరునామా: మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్,
నార్త్ టవర్ స్మార్ట్‌వర్క్స్, వైష్ణవి టెక్ పార్క్,
సర్వే సంఖ్య 16/1 & సంఖ్య 17/2, అంబలిపురా గ్రామం, వర్తుర్ హోబ్లి,
బెంగళూరు అర్బన్, కర్ణాటక - 560103. సోమవారం నుండి శుక్రవారం వరకు.
ఇ-మెయిల్: grievance@sharechat.co
గమనిక - మేము త్వరితగతిన ప్రాసెస్ చేయడానికి మరియు పరిష్కరించేందుకు, దయచేసి పైన పేర్కొన్న ఇమెయిల్ ఐడికి వినియోగదారు సంబంధిత ఫిర్యాదులు అన్ని పంపండి.
నోడల్ సంప్రదింపు వ్యక్తి - శ్రీమతి హర్లీన్ సేథి
ఇ-మెయిల్: nodalofficer@sharechat.co
గమనిక - ఈ ఇమెయిల్ పూర్తిగా పోలీసులు మరియు దర్యాప్తు సంస్థల ఉపయోగం కోసం మాత్రమే. వినియోగదారు సంబంధిత సమస్యలకు ఇది సరైన ఇమెయిల్ ఐడి కాదు. వినియోగదారు సంబంధిత అన్ని ఫిర్యాదుల కోసం, దయచేసి మమ్మల్ని grievance@sharechat.co ద్వారా సంప్రదించండి.
సవాలు చేసే హక్కు
మీరు అప్‌లోడ్ చేసిన లేదా పోస్ట్ చేసిన కంటెంట్ లేదా మీ కార్యాచరణ వేరొక వినియోగదారు ద్వారా నివేదించబడి మరియు మా ప్లాట్‌ఫారమ్ నుండి తీసివేయబడినట్లయితే, మేము అటువంటి తీసివేత మరియు దానికి మా కారణాల గురించి మీకు తెలియజేస్తాము. మీ కంటెంట్ అన్యాయంగా తీసివేయబడిందని మీరు విశ్వసిస్తే, మీరు యాప్‌లో అప్పీల్ అభ్యర్థనను లేవనెత్తవచ్చు, లేదా తీసివేతను సవాలు చేయడానికి grievance@sharechat.co ద్వారా మాకు వ్రాయవచ్చు. మేము కంటెంట్‌ని మళ్లీ సమీక్షించి, అప్పీల్‌ల అభ్యర్థన యొక్క చెల్లుబాటును సమీక్షిస్తాము.
మా మార్గదర్శకాలను పాటించని పక్షంలో మేము తీసుకోగల పైన పేర్కొన్న చర్యలతో పాటు, అటువంటి ఉల్లంఘనల కోసం మీరు వ్యక్తులు/నియంత్రకులు/చట్టపరమైన అధికారుల నుండి వ్యక్తిగత, పౌర మరియు నేర చర్యలను కూడా మీరు ఎదుర్కోవచ్చు. దయచేసి మీకు సంబంధించిన, ఐటి నిబంధనలలోని రూల్ 3(1)(b)తో కలిపి చదివిన చట్టాల యొక్క సచిత్ర మరియు సూచనాత్మక జాబితాను క్రింద చూడండి: టేబుల్ ఇక్కడ రావాలి (table inserted)
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా నీతిశాస్త్ర స్మృతి) నియమాలు, 2021 యొక్క నియమం 3(1)(బి) మరియు దాని సవరణలు ("మధ్యవర్తి నియమాలు") | వర్తించే చట్టాల క్రింద సంబంధిత నిబంధనలు (శిక్షాస్పద చర్యల యొక్క దృష్టాంతముగానున్న మరియు సూచిక జాబితా) |
---|---|
(i) వేరొకరి హక్కులను ఉల్లంఘించడం | డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం, 2023 [ఎస్.33(1)] |
(ii) జూదం లేదా మనీలాండరింగ్ వంటి స్పష్టమైన (సి.ఎస్.ఏ.ఎమ్/అశ్లీల/లైంగిక వేధింపులు), దురాక్రమణ, వేధింపు లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించేటువంటి కంటెంట్ | భారతీయ న్యాయ సంహిత, 2023 [ఎస్. 196, 294, 295, 77, 353] లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012 [ఎస్.11 మరియు 12] మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 [ఎస్. 4] సమాచార సాంకేతిక చట్టం, 2000 [ఎస్. 66ఇ, 67 మరియు 67ఏ] |
(iii) పిల్లలకు హానికరం | బాలల న్యాయ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 [ఎస్. 75] సమాచార సాంకేతిక చట్టం, 2000 [ఎస్. 67బి] |
(iv) పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, కాపీరైట్‌లు లేదా యాజమాన్య హక్కులను ఉల్లంఘించడం | ట్రేడ్ మార్క్స్ చట్టం, 1999 [ఎస్. 29] కాపీరైట్ చట్టం, 1957 [ఎస్.51] |
(v) సందేశం యొక్క మూలం గురించి చిరునామాదారుని మోసగించడం లేదా తప్పుదారి పట్టించడం లేదా తెలిసి మరియు ఉద్దేశపూర్వకంగా కొంత తప్పుడు లేదా పూర్తిగా తప్పుడు సమాచారం మరియు అసత్యం లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని అందించడం. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు సమాచారమును అందించడంతో సహా పైవి అన్నీ. | భారతీయ న్యాయ సంహిత, 2023 [ఎస్. 212, 336, 353] |
(vi) వేషధారణ | భారతీయ న్యాయ సంహిత, 2023 [ఎస్. 319] సమాచార సాంకేతిక చట్టం, 2000 [ఎస్. 66డి] |
(vii) జాతీయ భద్రత, ఐక్యత, విదేశీ సంబంధాలను దెబ్బతీసే చర్యలు లేదా నేరాలను ప్రేరేపించడం | సమాచార సాంకేతిక చట్టం, 2000 [ఎస్. 66ఎఫ్] |
(viii) అంతరాయం కలిగించే కంప్యూటర్ కోడ్ యొక్క మాల్వేర్‌ని కలిగి ఉండటం | సమాచార సాంకేతిక చట్టం, 2000 [ఎస్. 43 మరియు 66] |
(ix) అనుమతించబడని ఆన్‌లైన్ ఆటలను ప్రచారం చేయడం లేదా ప్రోత్సహించడం | వినియోగదారుల రక్షణ చట్టం, 2019 [ఎస్. 89] |
(x) ఇప్పటికే ఉన్న చట్టాలను ఉల్లంఘించడం |
ఒకవేళ అవసరమైతే, మేము చట్టపరమైన అధికారులు మరియు చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాలతో సహకరిస్తాము. మీకు సహాయం చేసే బాధ్యత మాకు లేదని దయచేసి గమనించండి.