Skip to main content

షేర్ చాట్ కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలు

Last updated: 10th January 2024

ఈ కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలు ("మార్గదర్శకాలు") https://sharechat.com వద్ద ఉండే మా వెబ్‌సైట్ మరియు/లేదా షేర్ చాట్ మొబైల్ అప్లికేషన్ (సంయుక్తంగా, "ఫ్లాట్‌ఫారం") యొక్క మీ ఉపయోగాన్ని పరిపాలిస్తుంది, ఇది భారతీయ చట్టాల ద్వారా ఏర్పాటు చేయబడి, మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ టవర్ స్మార్టువర్క్స్, వైష్ణవి టెక్ పార్క్, సర్వే నెం 16/1 & నెం 17/2 అంబలిపురా విలేజ్, వార్తుర్ హొబ్లీ, బెంగళూరు అర్బన్, కర్ణాటక – 560103 వద్ద రిజిస్టర్ ఆఫీసు కలిగిన ఒక ప్రైవేట్ కంపెనీ అయిన మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్. ("షేర్ చాట్", "కంపెనీ", "మేం", "మా" మరియు "మా యొక్క") ద్వారా అందించబడుతోంది. . "మీరు" మరియు "మీ యొక్క" అనే పదాలు ఫ్లాట్‌ఫారం యూజర్‌ని తెలియజేస్తాయి.

ఈ మార్గదర్శకాలను షేర్ చాట్ ఉపయోగ నిబంధనలు, మరియు షేర్ చాట్ గోప్యతా విధానం (సమిష్టిగా, "నిబంధనలు")తో చదవాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాల్లో ఉపయోగించే క్యాపిటలైజ్డ్ పదాలు, నిబంధనలలోని అటువంటి పదాలకు ఇవ్వబడ్డ అర్థాన్ని కలిగి ఉంటాయి.

మేం ఈ మార్గదర్శకాలను నియతానుసారంగా మార్చవచ్చు అని మరియు ఆ విధంగా చేసేందుకు మాకు హక్కు ఉందని దయచేసి గమనించండి. తాజా అప్‌డేట్ చేసిన వెర్షన్ ఎఫ్పుడూ ఇక్కడ లభ్యమవుతుంది

మా ఫ్లాట్‌పారం భారతదేశ దేశవ్యాప్తంగా మరియు ప్రపంచంలోని ఇరత ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో మిమ్మల్ని అనుసంధానం చేస్తుంది. మేం సృష్టించిన కమ్యూనిటీ వైవిధ్యభరితమైనది మరియు వివిధ రకాలైన కంటెంట్‌కు అనుకూలంగా ఉంటుంది, అయితే ఫ్లాట్‌ఫారాన్ని వివిధ రకాలైన ఆడియెన్స్ యాక్సెస్ చేసుకుంటారు, వీరిలో మైనర్‌లు మరియు యువత ఉండవచ్చు. అందువల్ల, మా యూజర్‌లందరూ ఒక ప్రామాణిక విధానాన్ని పాటించేలా చూడటానికి మరియు మీరు సృజనాత్మకంగా వ్యక్తీకరించడానికి ఒక సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించడానికి, ప్లాట్‌ఫారం ఉపయోగాన్ని నియంత్రించే కఠినమైన మార్గదర్శకాలు మరియు పరిమితులను మేం రూపొందించాం.

కంటెంట్ మార్గదర్శకాలు

మా ఫ్లాట్‌ఫారం అనుమతించని మరియు మా మార్గదర్శకాలు అదేవిధంగా వర్తించే భారతీయ చట్టాలు రెండింటిని ఉల్లంఘించే కంటెంట్‌ని మేం చురుగ్గా తొలగిస్తాం. అటువంటి కంటెంట్ మా దృష్టికి వచ్చినట్లయితే, మేం దానిని తొలగిస్తాం లేదా యూజర్ అకౌంట్‌లను నిషేధిస్తాం. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఏదైనా కంటెంట్‌ని మీరు చూసినట్లయితే, దానిని రిపోర్ట్ చేసేలా మీరు ప్రోత్సహించబడతారు. క్రియేటర్ యొక్క ఉద్దేశ్యం ముఖ్యం. మేం సృజనాత్మక స్వేచ్ఛ ప్రాముఖ్యతను మేం అర్థం చేసుకుంటాం, అయితే, అసౌకర్యాన్ని కలిగించేందుకు ఉద్దేశించబడ్డ కంటెంట్‌ని, ద్వేషపూరిత ప్రసంగం మరియు దుర్బాషణలుగా పరిగణించే వాటిని వ్యాప్తి చేయడం, హింస మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడం లేదా షేర్ చాట్‌పై క్రియేటర్ లేదా ఆర్టిస్ట్ ఎకోసిస్టమ్‌ని అడ్డంకిగా ఉండే కంటెంట్‌ని మేం స్వాగతించం.

a. వర్తించే చట్టాలకు కట్టుబడి ఉండటం

మా ఫ్లాట్‌ఫారంపై అప్‌లోడ్ చేసిన, పోస్ట్ చేసిన, వ్యాఖ్యానించిన, లేదా మీ ద్వారా పంచుకోబడ్డ కంటెంట్‌తో సహా అయితే ఎలాంటి పరిమితులు లేకుండా మొత్తం కంటెంట్, భారతీయ శిక్షాస్మృతి, 1860 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 తో సహా,అటువంటి చట్టాల కింద చేసిన అన్ని నిబంధనలు మరియు సవరణలతో సహా, భారతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలి. వర్తించే చట్టాలను ఉల్లంఘించిన సందర్భాల్లో మేం చట్టపరమైన అధికారులకు సహకరిస్తాం మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ యంత్రాంగాలను అనుసరిస్తాం.

భారతదేశం యొక్క ఐక్యత, సమగ్రత, రక్షణ, భద్రత లేదా సార్వభౌమత్వాన్ని, విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను లేదా ప్రజా క్రమాన్ని బెదిరిస్తే కంటెంట్ అప్‌లోడ్ చేయబడదు, పోస్ట్ చేయబడదు, వ్యాఖ్యానించదు లేదా భాగస్వామ్యం చేయబడదు. మీరు ఏ ఇతర దేశానికి అవమానకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేయలేరు లేదా నిమగ్నం చేయలేరు, ఏదైనా నేరాల కమిషన్‌ను ప్రేరేపిస్తారు లేదా నేరాల దర్యాప్తును నిరోధిస్తారు.

b. నగ్నత్వం మరియు పోర్నోగ్రఫీ

కళాత్మక మరియు విద్యా ప్రయోజనాలు, ప్రజావగాహన, హాస్యం లేదా వ్యంగ్య ఉద్దేశ్యాల కొరకు పోస్ట్ చేసినట్లయితే, పరిమితంగా లైంగిక చిత్రాలను కలిగి ఉండే కంటెంట్‌ని మేం అనుమతిస్తాం. దిగువ పేర్కొన్నవి ఉండే కంటెంట్ ఫ్లాట్‌ఫారంపై నిషేధించబడుతుంది మరియు ఈ మార్గదర్శకాల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది:

 • అశ్లీల, ప్రైవేట్ భాగాలు (లైంగిక అవయవాలు, మహిళల రొమ్ములు మరియు చనుమొనలు, పిరుదులు)లను బహిర్గతం చేసే లైంగిక స్వభావం కలిగిన, అశ్లీల లేదా నగ్న మెటీరియల్ లేదా ఇమేజ్‌లు/వీడియోలు మరియు/లేదా లైంగిక కార్యక్రమాలు వర్ణించేవి;
 • లైంగిక చర్యలు/హావభావాలు లేదా ఆరాధన లేదా శృంగార ఉద్దేశం లేదా లైంగిక ప్రేరేపణ వ్యక్తీకరించే సన్నిహిత భంగిమలు లేదా కంటెంట్‌లో వ్యక్తుల వీడియోలు లేదా ఇమేజ్‌లు;
 • లైంగిక బలవంతం లేదా ప్రతీకారం తీర్చుకునే పోర్నోగ్రఫీ;
 • మృగప్రాయత్వం లేదా జూఫిలియా;
 • ఏదైనా వ్యక్తిని దోపిడీ చేసే లేదా అపాయం కలిగించే కంటెంట్ (ఉదాహరణకు, వ్యభిచారాన్ని లేదా ఎస్కార్ట్ సేవలను ప్రోత్సహించడం లేదా అభ్యర్థించే ఉద్దేశ్యాలతో సహా ఒక వ్యక్తి ఏదైనా దోపిడి లేదా అపాయాన్ని లక్ష్యంగా చేసుకునే ఫోన్ నెంబర్‌లు, లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని జాబితా చేసుకోవడం); -పెడోఫిలిక్ లేదా దీనికి సంబంధించిన కంటెంట్ చిన్నపిల్లల నీలిచిత్రాలు (పిల్లల నీలిచిత్రాలను సృష్టించడం, ప్రమోట్ చేయడం, పెద్దది చేసి చూపించడం, ప్రసారం చేయడం లేదా బ్రౌజ్ చేయడంతో సహా అయితే వాటికే పరిమితం కాకుండా); లేదా
 • అసభ్యకరమైన, అనైతికమైన లేదా సంబంధించిన కంటెంట్ అత్యాచారం, లైంగిక ఆక్షేపణ, సమ్మతి లేని కార్యకలాపాలు మరియు వేధింపులపై కంటెంట్.

c. వేధింపులు మరియు గుడ్డి బెదిరింపులు

మా ఫ్లాట్‌ఫారంపై ఏదైనా రకం వేధింపులు లేదా గుడ్డిబెదిరింపులను మేం కఠినంగా ఖండిస్తాం. మా యూజర్‌లు బావోద్వేగ లేదా మానసిక వేదనకు సంబంధించిన భయం లేకుండా తమ భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వాలని మేం కోరుకుంటున్నాం. చిల్లరగా లేదా కోపాన్ని కలిగించగల ఏదైనా కంటెంట్‌ని విస్మరించాలని మేం అభ్యర్ధిస్తున్నాం. దీనికి అదనంగా, మరో వ్యక్తిని వేధించే లేదా ఏదైనా వ్యక్తిని కించపరచాలని లేదా అవమానించాలని భావించే అటువంటి కంటెంట్ గురించి నివేదించేందుకు కూడా మేం మిమ్మల్ని ప్రోత్సహిస్తాం.

ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్‌లో, వీటితో సహా అయితే వీటికే పరిమితం కాకుండా ఉంటాయి:

 • దుర్భాషలాడే భాష లేదా తిట్లు పదాలు, మార్ఫ్ చేసిన ఇమేజ్‌లు, మరియు/లేదా మోసపూరితమైన రికార్డింగ్‌లు పోస్ట్ చేయడం.
 • వారి, అవమానించడం లేదా వేధించడం జాతి, రూపం, కులం, రంగు, వైకల్యాలు, మతం, లైంగిక ప్రాధాన్యతలు, మరియు / లేదా లైంగిక అభివృద్ది చేయడం లేదా లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడటం ఆధారంగా ఒకరిని ఆక్షేపణ చేయడం, అవమానించడం లేదా వేధించడం ఈ వేదికపై సహించదు. అదేవిధంగా, పైన పేర్కొన్న కంటెంట్ ఆధారంగా ఏదైనా వ్యక్తిని దోచుకోవడం లేదా బ్లాక్ మెయిల్ చేయడం ఖచ్చితంగా నిషేధించబడింది.
 • ఎవరైనా మిమ్మల్ని వారి ఖాతా నుంచి బ్లాక్ చేసినట్లయితే, దయచేసి వేరే ఖాతా నుంచి వారిని సంప్రదించడానికి ప్రయత్నించవద్దు. యూజర్ ఫ్లాట్‌ఫారంపై మీతో నిమగ్నం కావాలని కోరుకోనట్లయితే, మీరు దానిని మరియు పరస్పరం గౌరవించుకోవాలని మేం అభ్యర్ధిస్తున్నాం.
 • వేధించడం, అపాయం లేదా వారిని అపాయంలో నెట్టే ఉద్దేశ్యం వారి సమ్మతి లేకుండా పంచుకోబడ్డ ఒక వ్యక్తి యొక్క ఏదైనా చిత్రం లేదా సమాచారం.
 • ఆర్థిక లాభం కోసం ఒకరిని వేధించడానికి లేదా వారికి ఏదైనా గాయం కలిగించడానికి తప్పుడు సమాచారం పోస్ట్ చేయబడింది.

అయితే, వార్తల్లో కనిపించే లేదా పెద్ద మొత్తంలో పబ్లిక్ ఆడియెన్స్ ఉండే అటువంటి వ్యక్తుల గురించి ఒక క్లిష్టమైన చర్చ మరియు చర్చ లు ఇమిడి ఉన్నట్లయితే, మేం దానిని నిబంధనలు మరియు ఈ మార్గదర్శకాలకు లోబడి అనుమతించవచ్చు.

d. మేధోపరమైన ఆస్తి

మేధోసంపత్తి హక్కులను పరిరక్షించడం మరియు తీవ్రమైన దుష్ప్రవర్తన వంటి హక్కుల ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకోవడమే మా లక్ష్యం. సాహిత్య, సంగీత, నాటక, కళాత్మక, సౌండ్ రికార్డింగ్‌లు, సినిమాటోగ్రాఫిక్ రచనలు వంటి మొత్తం కంటెంట్ మేధో ఆస్తి రక్షణకు లోబడి ఉంటుంది.

ఒరిజినల్ కాని మరియు అటువంటి కంటెంట్/వర్క్‌పై మేధోపరమైన ఆసక్తి హక్కులు ఉండే వ్యక్తి/సంస్థ నుంచి కాపీ చేసిన కంటెంట్‌ని ఫ్లాట్‌ఫారంపై పోస్ట్ చేయడానికి అనుమతించబడదు. తృతీయపక్షాల యొక్క మేధోపరమైన ఆస్తి హక్కులను ఉల్లంఘించే ఏదైనా కంటెంట్ తొలగించబడుతుంది మరియు పదేపదే తప్పు చేసే యూజర్‌లకు విరుద్ధంగా కఠినమైన చర్య తీసుకోబడుతుంది. ఫ్లాట్‌పారం లోపల మీరు అటువంటి కంటెంట్‌ని పంచుకోవాలని అనుకుంటే, కంటెంట్ ఒరిజినల్ సోర్స్‌ని తెలియజేసే ఏవైనా ఆట్రిబ్యూషన్‌లు, వాటర్‌మార్క్‌లు మరియు ఒరిజినల్ క్యాప్షన్‌లను దయచేసి తొలగించవద్దు. దీనికి అదనంగా, వారి పేరు మరియు/లేదా ఒరిజినల్ సోర్సును పేర్కొనడం ద్వారా అటువంటి కంటెంట్‌లో మేధోపరమైన ఆసక్తి హక్కులు కలిగి ఉండే మీ తోటి యూజర్‌లు లేదా ఏదైనా ఇతర సంస్థ/వ్యక్తుల నుంచి దయచేసి అవసరమైన అనుమతులు తీసుకోండి మరియు పూర్తి క్రెడిట్‌ని ఇవ్వండి.

e. హింస

హింసను మరియు బాధ్యతను పెద్దదిగా చేసే లేదా హింసను కీర్తించే, భౌతిక హింస లేదా జంతు క్రూరత్వాన్ని చిత్రీకరించే ఉద్దేశ్యంతో గ్రాఫికల్ ఇమేజ్‌లు లేదా వీడియోలకు పరిమితం కాకుండా, మా యూజర్‌లకు అసౌకర్యం కలిగించే అన్ని కంటెంట్‌లు చేర్చబడతాయి. ప్రమాదకరమైన మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే, లేదా తీవ్రవాదం, వ్యవస్థీకృత హింస లేదా నేరపూరిత కార్యకలాపాల్లో నిమగ్నమైన వ్యక్తులు, గ్రూపులు లేదా నాయకులను ప్రశంసించే కంటెంట్ పూర్తిగా నిషేధించబడింది.

హింసకు సంబంధించిన అవగాహన లేదా సమాచారాత్మక కంటెంట్‌ని ఫ్లాట్ ఫారం మీద అనుమతించవచ్చు. కల్పిత సెటప్ రూపంలో, మార్షల్ ఆర్ట్స్ రూపంలో ఫ్లాట్‌ఫారంపై హింసాత్మక కంటెంట్‌ని ఈ మార్గదర్శకాలను లోబడి అనుమతించవచ్చు.

f. ద్వేషపూరిత ప్రసంగం మరియు ప్రచారం

ఒక వ్యక్తి లేదా ఒక వ్యక్తి గ్రూపుకు విరుద్ధంగా హింసాత్మక ప్రవర్తనను ప్రోత్సహించే కంటెంట్, ఏదైనా నిర్ధిష్ట మతం, జాతి, కులం, తెగ, కమ్యూనిటీ, జాతీయత, వైకల్యత (శారీరక లేదా మానసిక), వ్యాధులు లేదా లింగంవారిని భయపెట్టడం, లక్ష్యంగా చేసుకోవడం లేదా అమర్యాదగా ప్రవర్తించడం నిషేధించబడింది. మతం, కులం, జాతి, కమ్యూనిటీ, లైంగిక దృక్పథం లేదా లింగ గుర్తింపుతో సహా అయితే వాటికే పరిమితం కాకుండా వీటికి సంబంధించి ద్వేషం కలిగించే లేదా ద్వేషాన్ని కలిగించే ఉద్దేశ్యం కలిగిన లేదా ద్వేషాన్ని వ్యాప్తి చేసే లేదా ద్వేష ప్రచారం చేసే ఏదైనా రకం కంటెంట్. మేం వివక్షను వ్యాప్తి చేసే, పైన పేర్కొన్న లక్షణాల ఆధారంగా హింసను సమర్థించడం మరియు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల గ్రూపును ఏదైనా అర్థంలో తక్కువ చేయడం లేదా ప్రతికూల భావనలతోనైనా సూచించే కంటెంట్‌ని మేం స్వీకరించం.

మా యూజర్‌లకు ఆగ్రహం కలిగించే మరియు వారిని ప్రతికూలంగా ప్రభావితం చేసే అసభ్యకరమైన వ్యాఖ్యానం మరియు ప్రచురణ సిద్ధాంతాలు లేదా ద్వేషపూరిత భావజాలం నుంచి దూరంగా ఉండాలని మేం మిమ్మల్ని కోరుతున్నాం. ఈ విషయాలపై అవగాహన పెంచడానికి లేదా సవాలు చేయడానికి ఉద్దేశించిన అటువంటి కంటెంట్‌ను ప్లాట్‌ఫారంలో పోస్ట్ చేయాలనే స్పష్టమైన ఉద్దేశ్యానికి లోబడి మేం అనుమతించవచ్చు.

g. వేధింపులు, స్వీయ గాయం లేదా ఆత్మహత్య

ఆత్మహత్య లేదా అటువంటి ధోరణులను ప్రదర్శించే, స్వీయ గాయం మరియు హానిని ప్రేరేపించే లేదా ప్రమాదకరమైన కార్యకలాపాల్లో పాల్గొనడాన్నిప్రోత్సహించే కంటెంట్‌ని మేం అనుమతించం. శారీరక, మానసిక, లైంగిక లేదా మానసిక అసభ్య దుర్భాషణ, నిర్లక్ష్యం లేదా పిల్లలు లేదా పెద్దవారైనా, ఒక వ్యక్తిని దుర్బాషలాడే కంటెంట్‌ను కఠినంగా ఖండించబడుతుంది. స్వీయ హానికి చూపించే, స్వీయ గాయాన్ని పెద్దది చేయడం లేదా ఆత్మహత్య లేదా ఇంకా ఏదైనా చర్యల ద్వారా స్వీయ హాని ఎలా చేసుకోవాలనే దానిపై సూచనలను పేర్కొనే కంటెంట్ అనుమతించబడదు. తదుపరి, మానసిక/శారీరకంగా బాధపెట్టే, వేధింపులు, స్వీయ గాయం లేదా గృహ లేదా ఏదైనా ఇతర హింస బాధితులు లేదా బయటపడ్డవారిని గుర్తించే, ట్యాగ్‌లు, దాడిచేసే మరియు అమానవీయంగా ప్రవర్తించే కంటెంట్ నిషేధించబడింది.

అటువంటి తీవ్రమైన సమస్యలకు లోనైనవారికి మద్దతు, సాయం మరియు ఉపశమనాన్ని అందించే కంటెంట్‌ని మేం అనుమతిస్తాం. అలాంటి కంటెంట్‌ని పోస్ట్ చేయాలనే ఉద్దేశ్యానికి లోబడి, సాయం అవసరమైన వారికి వారి అనుభవాలను పంచుకోవడానికి ఉపశమన యంత్రాంగాలను అందించేందుకు మేం యూజర్‌లను అనుమతిస్తాం.

h. చట్టవ్యతిరేక కార్యకలాపాలు

చట్టవ్యతిరేక కార్యకలాపాలను సమర్ధించే లేదా ప్రోత్సహించే కంటెంట్‌ని మేం ఏమాత్రం సహించం. ఆర్గనైజ్డ్ క్రైమ్, నేరపూరిత కార్యకలాపాలు, ఆయుధాలు, మందుగుండుమరియు పేలుడు పదార్ధాలు ప్రోత్సహించడం/అమ్మడం/ఉపయోగించడం, హింస మరియు తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి కంటెంట్‌ని మేం నిషేధిస్తాం. చట్టవ్యతిరేక వస్తువులు లేదా సేవలు, నియంత్రించబడ్డ గూడ్స్, డ్రగ్స్ మరియు నియంత్రించబడ్డ పదార్ధాలు అమ్మడం, మరియు లైంగిక సేవల బేరసారాలు లదా విక్రయించడం పూర్తిగా నిషేధించబడుతుంది.

పిల్లలను వేధించే, హానికరమైన లేదా దుర్వినియోగం చేసే కంటెంట్‌ను మేము అనుమతించము. మనీలాండరింగ్ లేదా జూదానికి సంబంధించిన లేదా ప్రోత్సహించే కంటెంట్‌ను వినియోగదారులు పోస్ట్ చేయలేరు.

నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొనడం, బాంబ్‌లు తయారు చేయడం లేదా మాదక ద్రవ్యాలను ప్రోత్సహించడం లేదా వినియోగించడం లేదా వ్యాపారం చేయడంతో సహా అయితే వాటికే పరిమితం కాకుండా చట్టవ్యతిరేక మరియు నిషేధించబడ్డ కార్యకలాపాల గురించి యూజర్‌లకు ట్యుటోరియల్స్ లేదా సూచనలు లేదా అవగాహన కల్పించే కంటెంట్ పోస్ట్ చేయడానికి యూజర్‌లు అనుమతించబడరు. భారత ప్రభుత్వం ద్వారా చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటించి గూడ్స్ మరియు సర్వీస్‌లు ఇమిడి ఉండే ఏదైనా లావాదేవీ లేదా గిఫ్ట్ బేరసారాలు లేదా సదుపాయం కల్పించడానికి మా ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించవద్దు. మరో వ్యక్తిని అనుకరించడం (మీ కుటుంబం, స్నేహితులు, సెలబ్రిటీలు, బ్రాండ్‌లు లేదా ఏదైనా ఇతర వ్యక్తులు/సంస్థలు వంటివి) మరియు వ్యక్తిగత లేదా ఆర్థిక లబ్ధిని పొందడానికి మా ఫ్లాట్‌ఫారంపై తప్పుడు లేదా తప్పుతోవ పట్టించే సమాచారాన్ని పంపిణీ చేయడం మోసంగా పరిగణించబడుతుంది.

మరో వ్యక్తిని అనుకరించడం (మీ కుటుంబం, స్నేహితులు, సెలబ్రిటీలు, బ్రాండ్‌లు లేదా ఏదైనా ఇతర వ్యక్తులు/సంస్థలు వంటివి) మరియు వ్యక్తిగత లేదా ఆర్థిక లబ్ధిని పొందడానికి మా ఫ్లాట్‌ఫారంపై తప్పుడు లేదా తప్పుతోవ పట్టించే సమాచారాన్ని పంపిణీ చేయడం మోసంగా పరిగణించబడుతుంది. కంప్యూటర్ వైరస్లు, మాల్వేర్ లేదా ఏదైనా కంప్యూటర్ వనరు యొక్క కార్యాచరణను పరిమితం చేయడానికి రూపొందించబడిన ఏదైనా ఇతర కంప్యూటర్ కోడ్‌ను కలిగి ఉన్న కంటెంట్‌ను ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేయలేము.

i. సమ్మతి లేని (వ్యక్తిగత) కంటెంట్

అటువంటి మెటీరియల్ పోస్ట్ చేయడానికి సమ్మతి ఇవ్వని ఇతర వ్యక్తుల చిత్రాలు లేదా వీడియోలతో సహా వ్యక్తిగత కంటెంట్ లేదా డేటా లేదా సమాచారాన్ని పోస్ట్ చేయడం లేదా దుర్వినియోగం చేయడానికి అనుమతించబడదు. వారి అనుమతి లేదా సమ్మతి లేకుండా ఎవరైనా వ్యక్తిగత లేదా సన్నిహితమైన ఫోటోలు లేదా వీడియోలను పోస్ట్ చేయవద్దు.ఎవరి గోప్యతకు హాని కలిగించే కంటెంట్‌ను పోస్ట్ చేయవద్దు. మేం అటువంటి కంటెంట్‌ని తొలగిస్తాం.

వీటితో సహా అయితే వీటికే పరిమితం కాకుండా ఎవరైనా వ్యక్తిగత లేదా సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడం: సంప్రదించు సమాచారం, చిరునామా, ఆర్ధిక సమాచారం, ఆధార్ నెంబరు, ఆరోగ్య సంరక్షణ సమాచారం, లైంగిక లేదా సున్నిహిత ఇమేజ్‌లు, వీడియోలు మరియు పాస్‌పోర్ట్ సమాచారం, లేదా అటువంటి సమాచారాన్ని వెల్లడించేలా ఎవరైనా బెదిరించడం వేదింపులుగా పరిగణించబడుతుంది, మరియు అటువంటి కార్యకలాపాలు కఠినంగా ఆమోదించబడవు.

j. స్పామ్

కంటెంట్ మూలం గురించి వినియోగదారులను తప్పుదారి పట్టించే, తప్పుడు ప్రకటనలను ప్రదర్శించే లేదా ప్రోత్సహించే కంటెంట్, మోసపూరితమైన లేదా తప్పుదోవ పట్టించే ప్రాతినిధ్యాలు మరియు భద్రతా ఉల్లంఘనలు స్పామ్ పరిధిలోకి వస్తాయి. ఇటువంటి కంటెంట్, వాణిజ్య లాభం కోసం పోస్ట్ చేసినప్పుడు, వాణిజ్య స్పామ్‌కి సమానం. ప్లాట్‌ఫాం యొక్క సున్నితమైన పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది మరియు ఇతర వినియోగదారులను భాగస్వామ్యం మరియు కనెక్ట్ చేయకుండా నిరోధిస్తుంది. మీరు పంచుకునే కంటెంట్ ప్రామాణికమైనది మరియు ప్లాట్‌ఫామ్‌లో ప్రజలు పోస్ట్ చేయడానికి సురక్షితమైన మరియు విశ్వసనీయ వాతావరణాన్ని సృష్టించడానికి వీలు కల్పించడం చాలా ముఖ్యం. స్పామ్, వాణిజ్య లేదా ఇతరత్రా ప్రోత్సహించడానికి వీక్షకులను బాధపెట్టాలని లేదా వస్తువులు / సేవలను విక్రయించాలని అనుకుంటే అదే కంటెంట్‌ను చాలాసార్లు పోస్ట్ చేయవద్దు. ట్రాఫిక్‌ను ఉత్పత్తి చేయడానికి లేదా అనుచరులు, ఇష్టాలు, వీక్షణలు, వ్యాఖ్యలు మరియు వాటాలను పెంచడానికి కృత్రిమ మరియు మానిప్యులేటివ్ మార్గాలను ఉపయోగించవద్దు.

మీరు మీ వస్తువులు లేదా సేవలను ప్రోత్సహించాలనుకుంటే, ప్రామాణికమైన పద్ధతిలో అలా చేయమని మేము మిమ్మల్ని కోరుతున్నాము.

l. తప్పుడు సమాచారం

మా ప్లాట్‌ఫారంపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందించడాన్ని నిరోధించడమే మా లక్ష్యం. యూజర్ లేదా సాధారణ ప్రజానీకాన్ని పెద్ద మొత్తంలో తప్పుడు తోవ పట్టించే ఉద్దేశ్యంతో ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధం, తప్పుడు సమాచారం, బూటకం లేదా నకిలీ ప్రచారాన్ని వ్యాప్తి చేసే ఏదైనా కంటెంట్ అనుమతించబడదు. వాస్తవేతర అంశాలను ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పటికే ఉన్న వార్తలను అతిశయోక్తి చేసి చెప్పే కంటెంట్‌ని పోస్ట్ చేయడాన్ని మేం నిషేధిస్తాం.

యూజర్‌లను తప్పుదారి పట్టించే లేదా కంటెంట్ ఫ్యాబ్రికేట్ చేయడానికి ఒక అవెన్యూ సృష్టించడానికి ప్రయత్నించే లేదా పరువు నష్టం కలిగించేది, అవమానకరమైనది లేదా ఒకరి పేరుప్రఖ్యాతులను దెబ్బతీసేందుకు ప్రయత్నించడం లేదా తప్పుడు సమాచారం ఆధారంగా వారి ఆర్థిక లేదా రాజకీయ హోదాలను దెబ్బతీయడానికి ప్రయత్నించే కంటెంట్‌ని మేం ఫ్లాట్‌ఫారంపై అనుమతించం. నకిలీ న్యూస్ ప్రమాదంపై పోరాడటానికి మేం తృతీయపక్ష ఫ్యాక్ట్ చెక్కర్‌లను నిమగ్నం చేస్తాము, కంటెంట్‌లోని ఏదైనా భాగం వాస్తవంగా తప్పుగా ఉన్నట్లుగా కనుగొన్నట్లయితే మా యూజర్‌లను సానుకూలంగా హెచ్చరిస్తుంది. మీరు దీనిని పరిగణనలోకి తీసుకొని, దానికి అనుగుణంగా వ్యవహరించాలని మేం మిమ్మల్ని కోరుతున్నాం.

అయితే మేం, ఏదైనా సెటైర్ లేదా పేరడీలతో నకిలీ న్యూస్‌ని గందరగోళపరచం. ఇతర యూజర్‌లను తప్పుతోవ పట్టించకుండా మరియు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉన్నంత ఈ కంటెంట్‌ని మేం ఫ్లాట్‌ఫారంపై అనుమతిస్తాం.

కమ్యూనిటీ మార్గదర్శకాలు

మీరు మా ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించేటప్పుడు, మీరు నిర్ధిష్ట నిబంధనలను పాటించాలని మేం ఆశిస్తాం:

a. సరైన దానిని ట్యాగ్ చేయండి

అన్ని పోస్ట్‌లు కూడా అత్యంత సముచితమైన ట్యాగ్‌తో ట్యాగ్ చేయబడాలి. అటువంటి ట్యాగ్‌లు లేనట్లయితే, అప్పుడు దానికి అనుగుణంగా ఒకటి సృష్టించండి. సంబంధం లేని లేదా సముచితం కాని ట్యాగ్‌లతో పోస్ట్ చేసిన ఏదైనా కంటెంట్‌ని, నివేదించినట్లయితే, ఫీడ్ నుంచి తొలగించబడుతుంది.

b. టాపిక్ పైన ఉండటం

షేర్ చాట్ చాలా యాక్టివ్ ఫ్లాట్‌ఫారం. మీ పోస్ట్ చేసే ఏదైనా కంటెంట్, పోస్ట్ క్యాప్షన్ మరియు ట్యాగ్‌లకు సంబంధించినదిగా ధృవీకరించుకోండి. క్యాప్షన్ లేదా ట్యాగ్‌లకు సంబంధం లేని కంటెంట్, లేదా నిర్ధిష్ట పోస్ట్‌కు సముచితమైనది కానిది తొలగించబడుతుంది. ట్రాక్ తప్పవద్దు.

c. బహుళ/నకిలీ ప్రొఫైల్స్

ఒక వ్యక్తి లేదా సంస్థ నకిలీ ప్రొఫైల్ సృష్టించడం మరియు ఎవరినైనా తప్పుదోవ పట్టించే లేదా మోసపూరితమైన రీతిలో, వారిని వేధించడం లేదా గుడ్డిబెదిరింపులు చేయాలనే ఉద్దేశ్యంతో లేదా లేకుండా అనుకరించడం అనుమతించబడదు. మేం కమ్యూనిటీ ప్రొఫైల్స్, సమాచారాత్మక ప్రొఫైల్ మరియు పబ్లిక్ వ్యక్తుల ఫ్యాన్ ప్రొఫైల్స్‌కు మేం మినహాయింపులు అనుమతించవచ్చు. ఇతర వినియోగదారులను తప్పుదారి పట్టించని ఉద్దేశంతో ఉన్నంత వరకు ప్రముఖుల సెటైర్ లేదా పేరడీ అకౌంట్‌లకు అనుమతించబడుతుంది మరియు ప్రొఫైల్ వివరణ లేదా ప్రొఫైల్ స్థితి‌లో దీనిని స్పష్టంగా పేర్కొనాలి.

d. భద్రత మరియు రక్షణ

ఎవరినైనా వేధించడం, మరో యూజర్‌తో మాట్లాడేటప్పుడు పోస్ట్‌లు లేదా కామెంట్‌ల్లో దుర్భాషలాడే భాషను ఉపయోగించరాదు. ఇతర యూజర్‌లు అసౌకర్యంగా భావించగల ఏదైనా చేయవద్దు. ఇతర యూజర్‌ల కొరకు మీరు ప్రతికూల పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నిస్తే, మీకు విరుద్ధంగా చర్య తీసుకోబడుతుంది.

e. చట్టపరమైన పర్యవసానాలతో జాగ్రత్తగా ఉండటం

చట్టాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది మీ చర్యలకు బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఒక సాకు కాదు. మా ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించడానికి, మీరు డిజిటల్ వాతావరణలో ప్రవర్తనను పరిపాలించే చట్టాలు మరియు నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. మా ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించేటప్పుడు మీ న్యాయపరిధిలో వర్తించే అన్ని చట్టాలను దయచేసి గౌరవించండి. చట్టవ్యతిరేక కార్యకలాపాలను కలిగి ఉన్న, ప్రోత్సహించే, అందించే, ప్రమోట్ చేసే, కీర్తించడం లేదా అభ్యర్థించడం వంటి ఏదైనా కంటెంట్ సహించబడదు.

f. సస్పెన్షన్ నుంచి తప్పించుకోవడం

ఏదైనా అకౌంట్‌ని సస్పెండ్ చేయాలనే మా నిర్ణయానికి యూజర్ కట్టుబడి ఉండాలి. ఇతర ఖాతాలు, గుర్తింపులు, వ్యక్తిత్వాలు లేదా మరో యూజర్ ఖాతాపై ఉనికి సృష్టించడం ద్వారా సస్పెన్షన్‌ని రద్దు చేసే ఏదైనా ప్రయత్నం కూడా సస్పెన్షన్‌కు దారితీస్తుంది. మీరు సస్పెన్షన్ నుంచి తప్పించుకోవాలని అనుకున్నట్లయితే, మేం అనివార్యంగా మీ అకౌంట్‌ని తొలగించడం మరియు మాతో రిజిస్టర్ చేసుకోకుండా మిమ్మల్ని బ్లాక్ చేయవచ్చు.

ఫ్లాట్‌ఫారం సెక్యూరిటీ

నివేదించడం

ఈ మారదర్శకాలను ఉల్లంఘించే ఏదైనా కంటెంట్ లేదా కార్యకలాపాన్ని మీరు చేసినప్పుడు, దయచేసి రిపోర్ట్ బటన్‌ని తట్టండి లేదా క్లిక్ చేయండి. మీరు కంటెంట్‌ని రిపోర్ట్ చేసినప్పుడు, మేం కంటెంట్‌ని ప్రాసెస్ చేస్తాం మరియు సమీక్షిస్తాం. కంటెంట్ లేదా యాక్టివిటీ మా ఫ్లాట్‌ఫారంపై ఉపయోగించలేం అని మేం కనుగొన్నట్లయితే, మేం దానిని తొలగిస్తాం. ఫ్లాట్‌పారంపై ఏదైనా కంటెంట్, కాపీరైట్ హోల్డర్‌గా మీ హక్కులను ఉల్లంఘిస్తున్నట్లుగా మీరు విశ్వసించినట్లయితే, మీరు మా టూల్ grievance@sharechat.co ఉపయోగించి ఒక కాపీరైట్ క్లెయింని మీరు ఫైల్ చేయవచ్చు మరియు ఇది తదుపరి సమీక్ష మరియు చర్య తీసుకోవడానికి మా టీమ్‌కు పంపబడుతుంది. ఫ్లాట్‌ఫారంపై అటువంటి కంటెంట్ మీకు నచ్చకపోవచ్చు, అయితే ఇది ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించదు. అటువంటి సందర్భంలో, అటువంటి యూజర్‌లను అన్ ఫాలో చేయడం లేదా బ్లాక్ చేయాలని మేం మిమ్మల్ని అభ్యర్థిస్తాం.

కంటెంట్ యొక్క మధ్యంతర స్థితి మరియు సమీక్ష

వర్తించే చట్టాల ప్రకారంగా మేం మధ్యవర్తులం. మా యూజర్‌లు పోస్ట్, వ్యాఖ్య, పంచుకోవడం లేదా ఫ్లాట్‌ఫారంపై చెప్పేదానిని మేం నియంత్రించం మరియు వారి (లేదా మీ) చర్యలకు (ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నా) బాధ్యత వహించం. మీరు మా సర్వీస్‌ల ద్వారా వాటిని యాక్సెస్ చేసినప్పటికీ ఇతరులు అందించే సర్వీస్‌లు మరియు ఫీచర్‌లకు మేం బాధ్యత వహించం. మా ఫ్లాట్‌ఫారంపై జరిగే దేని కొరకు అయినా మా బాధ్యత మరియు లయబలిటీ ఖచ్చితంగా భారతదేశం యొక్క చట్టాల ద్వారా పరిపాలించబడుతుంది మరియు పరిమితం చేయబడుతుంది.

మీరు పోస్ట్ చేసేదానికి మరియు మీరు చూసేదానికి మీరు బాధ్యత వహించాలని మేం ఆశిస్తాం. మా యూజర్‌లు ఎవరైనా మీ కంటెంట్ ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లుగా నివేదించినట్లయితే, మేం అవసరమైన విధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్షన్‌లు తీసుకోవచ్చు.

గ్రీవెన్స్ ఆఫీసర్

డేటా భద్రత, గోప్యత మరియు ఇతర ప్లాట్‌ఫాం వినియోగ సమస్యలకు సంబంధించి మీ సమస్యలను పరిష్కరించడానికి షేర్‌చాట్‌లో గ్రీవెన్స్ ఆఫీసర్ ఉన్నారు.

మీరు కిందివాటిలో గ్రీవెన్స్ ఆఫీసర్ మిస్ హర్లీన్ సేథి ను సంప్రదించవచ్చు:

చిరునామా: మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్,
నార్త్ టవర్ స్మార్టువర్క్స్, వైష్ణవి టెక్ పార్క్,
సర్వే నెం 16/1 & నెం 17/2 అంబలిపురా విలేజ్, వార్తుర్ హొబ్లీ,
బెంగళూరు అర్బన్, కర్ణాటక – 560103. సోమవారం నుండి శుక్రవారం వరకు.
ఇమెయిల్: grievance@sharechat.co
గమనిక - దయచేసి వినియోగదారుని సంబంధిత అన్ని ఫిర్యాదులను పైన పేర్కొన్న ఇమెయిల్ ఐడికి పంపండి, ప్రాసెస్ చేయడానికి మరియు వాటిని పరిష్కరించడానికి.

నోడల్ కాంటాక్ట్ పర్సన్ - మిస్ హర్లీన్ సేథి
ఇమెయిల్: nodalofficer@sharechat.co
గమనిక - ఈ ఇమెయిల్ కేవలం పోలీసులు మరియు దర్యాప్తు సంస్థల ఉపయోగం కోసం మాత్రమే. వినియోగదారు సంబంధిత సమస్యలకు ఇది సరైన ఇమెయిల్ ID కాదు. వినియోగదారుకు సంబంధించిన అన్ని ఫిర్యాదుల కోసం, దయచేసి grievance@sharechat.co వద్ద మమ్మల్ని సంప్రదించండి

సవాలు చేసే హక్కు

ఒకవేళ మీరు అప్‌లోడ్ చేసిన లేదా పోస్ట్ చేసిన కంటెంట్ లేదా మీ కార్యాచరణ మరొక వినియోగదారు నివేదించబడి, మా ప్లాట్‌ఫాం నుండి తీసివేయబడితే, అటువంటి తొలగింపు గురించి మరియు దాని యొక్క మా కారణాలను మేము మీకు తెలియజేస్తాము. ఒకవేళ నువ్వు కంటెంట్ అన్యాయంగా తొలగించబడిందని మీరు విశ్వసిస్తే, తొలగించడాన్ని సవాలు చేయడానికి మీరు grievance@sharechat.co వద్ద మాకు రాయవచ్చు. మేం కంటెంట్‌ను మళ్లీ సమీక్షిస్తాం మరియు దానిని ఫ్లాట్‌ఫారంపై తిరిగి పోస్ట్ చేయవచ్చా అని నిర్ధారిస్తాం.

ఉల్లంఘించేవారిపై మా చర్యలు

ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలను సకాలంలో తీసుకుంటాం. ఈ మార్గదర్శకాలు ఉల్లంఘించడానికి మీ ప్రొఫైల్ నివేదించబడినట్లయితే, అప్పుడు మీ ప్రొఫైల్ తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. ఈ మార్గదర్శకాలను పదేపదే ఉల్లంఘించినట్లయితే, మేం అనివార్యంగా మీ ఖాతాను రద్దుచేసి, మా సర్వీస్‌లను మీరు ఉపయోగించడాన్ని బ్లాక్ చేయవచ్చు.

మా నిబంధనలను పాటించని సమయంలో మేము తీసుకోగల పైన పేర్కొన్న చర్యలతో పాటు, అటువంటి ఉల్లంఘనల కోసం మీరు వ్యక్తులు/నియంత్రకులు/చట్టపరమైన అధికారుల నుండి వ్యక్తిగత, పౌర మరియు నేర బాధ్యతను కూడా భరించవచ్చు. దయచేసి మీకు వ్యతిరేకంగా విధించబడే IT నిబంధనలలోని రూల్ 3(1)(b)తో కలిపి చదివిన చట్టాల గురించి వివరించే మరియు వాటిని సూచించే జాబితాను కింద చూడండి:

రూల్ 3(1)(బి) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021 మరియు దాని సవరణలు (“మధ్యవర్తి నియమాలు”)సంబంధిత నిబంధనల కింద వర్తించే చట్టాలు (శిక్షాస్పద చర్యల యొక్క వివరించే మరియు సూచించే జాబితా)
(i) వేరొకరి హక్కులను ఉల్లంఘించడండిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 [S.33(1)]
(ii) స్పష్టంగా ఉన్న కంటెంట్ (CSAM/అశ్లీల), దాడి చేసే, వేధించే లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించే జూదం లేదా మనీలాండరింగ్ కంటెంట్ది ఇండియన్ పీనల్ కోడ్, 1860 [S.153A, 292, 293, 354C, 505(2)]
లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012 [S. 12]
మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 [S. 4]
ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 [S. 66E, 67 మరియు 67A]
(iii) పిల్లలకు హానికరంజువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 [S. 75]
ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 [S. 67B]
(iv) పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, కాపీరైట్‌లు లేదా యాజమాన్య హక్కులను ఉల్లంఘించడంట్రేడ్ మార్క్స్ చట్టం, 1999 [S. 29]
కాపీరైట్ చట్టం, 1957 [S.51]
(v) మెసేజ్ యొక్క మూల కారణం గురించి దాని మీద హక్కు ఉన్నవారిని మోసగించడం లేదా తప్పుదారి పట్టించడం లేదా తెలియక మరియు ఉద్దేశపూర్వకంగా ఏదైనా తప్పుడు సమాచారం లేదా సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడం, ఇది పూర్తిగా తప్పు మరియు అసత్యం లేదా తప్పుదారి పట్టించే స్వభావం. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు సమాచారంతో సహాది ఇండియన్ పీనల్ కోడ్, 1860 [S.177, 465, 469 మరియు 505]
(vi) మరొక వ్యక్తిగా వ్యవహరించడంది ఇండియన్ పీనల్ కోడ్, 1860 [S. 419]
ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ , 2000 [S. 66D]
(vii) జాతీయ భద్రత, ఐక్యత, విదేశీ సంబంధాలు లేదా నేరాలను ప్రేరేపించడంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 [S. 66F]
(viii) అంతరాయం కలిగించే కంప్యూటర్ కోడ్ యొక్క మాల్వేర్ కలిగి ఉండడంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 [S. 43 and 66]
(ix) అనుమతించబడని ఆన్‌లైన్ గేమ్‌ల ప్రకటన చేయడం లేదా ప్రచారం చేయడంది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ , 2019 [S. 89]
(x) ఇప్పటికే ఉన్న చట్టాలను ఉల్లంఘించడం

అవసరం అయితే, మేం చట్టపరమైన అధికారులు మరియు చట్టాలను అమలు యంత్రాంగాలతో సహకరిస్తాం. మీకు సాయం చేసేందుకు మాకు ఎలాంటి బాధ్యత లేదనే విషయాన్ని దయచేసి గమనించండి.