Skip to main content

షేర్‌చాట్ కాయిన్స్ పాలసీ

Last updated: 7th June 2021

ఈ కాయిన్స్ పాలసీ ("కాయిన్స్ పాలసీ") https://sharechat.com/ వద్ద ఉండే మా వెబ్‌సైట్ మరియు/లేదా షేర్‌చాట్ మొబైల్ అప్లికేషన్ (సంయుక్తంగా, "ఫ్లాట్‌ఫారం")పై మా కాయిన్స్ ఫీచర్ ("కాయిన్స్ ఫీచర్")యొక్క మీ ఉపయోగాన్ని పరిపాలిస్తుంది, ఇది భారతీయ చట్టాల ద్వారా ఏర్పాటు చేయబడి, నెం.2 26, 27 1వ అంతస్థు, సోనా టవర్స్, హోసూరు రోడ్, కృష్ణా నగర్, ఇండస్ట్రియల్ ఏరియా, బెంగళూరు, కర్ణాటక 560029 వద్ద రిజిస్టర్ ఆఫీసు కలిగిన ఒక ప్రైవేట్ కంపెనీ అయిన మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్. ("షేర్‌చాట్", "కంపెనీ", "మేం", "మా" మరియు "మా యొక్క") ద్వారా అందించబడుతోంది. "మీరు" మరియు "మీ యొక్క" అనే పదాలు ఫ్లాట్‌ఫారం యూజర్‌ని తెలియజేస్తాయి.

మీ స్నేహితులతో టచ్‌లో ఉండటానికి మరియు ఇమేజ్‌లు, వీడియోలు, మ్యూజిక్‌, స్థితి అప్‌డేట్‌లు, మరియు మీరు ఇష్టపడే ప్రాంతీయ భాషలో ఇంకా మరిన్ని పంచుకోవడానికి మా ఫ్లాట్‌ఫారం మీకు సాయపడుతుంది. మీరు ఇష్టపడే కంటెంట్‌ని మేం అర్థం చేసుకుంటాం మరియు మా ఫ్లాట్‌ఫారంపై ("సర్వీస్/సర్వీస్‌లు") లభ్యమయ్యే పోస్ట్‌లు, చిత్రాలు, వీడియోలు, మరియు సూచించిన కంటెంట్‌ని చూపించడానికి మీ న్యూస్‌ఫీడ్‌ని వ్యక్తిగతీకరిస్తాం.

కాయిన్స్ ఎలా పనిచేస్తాయి?#

మీరు ఇప్పుడు మా యూజర్‌లకు వర్చువల్ గిఫ్ట్‌లు/డిజిటల్ గూడ్స్ (స్టిక్కర్లు, జిఫ్‌లు, బ్యానర్‌లు మొదలైనవి) లైసెన్స్ పొందవచ్చు ("బహుమతులు"). మీరు మా అధీకృత చెల్లింపు విధానాలు మరియు మా ద్వారా అధికారం ఇచ్చి మరియు అందుబాటులో తెచ్చిన పేమెంట్ ప్రొవైడర్‌లను ఉపయోగించి కాయిన్‌లను ("కాయిన్స్/కాయిన్") పొందడం ద్వారా అటువంటి బహుమతులను పంపవచ్చు. కాయిన్‌లు/గిఫ్ట్‌లను క్యాష్, లేదా చట్టపరంగా చెల్లుబాటు అయ్యేవాటితో మారకం వేసుకోలేరు.

కాయిన్స్ కొనుగోలు చేయడం#

  • కొనుగోలు చేసే చోట కాయిన్స్ యొక్క ధర ప్రదర్శించబడుతుంది. మా ద్వారా పేర్కొన్న సంబంధిత చెల్లింపు యంత్రాంగం ద్వారా కొనుగోలు చేసే సమయంలో పేర్కొన్న కరెన్సీలో కాయిన్ల కొరకు అన్ని ఛార్జీలు మరియు చెల్లింపులు చేయబడతాయి.
  • మీ ద్వారా కొనుగోలు చేయబడ్డ ఏవైనా కాయిన్స్ యొక్క చెల్లింపుకు మీరు బాధ్యత వహిస్తారు. మీరు చెల్లింపు జరిపిన తరువాత, కొనుగోలు చేసిన కాయిన్స్ యొక్క సంఖ్యతో మీ యూజర్ అకౌంట్ క్రెడిట్ చేయబడుతుంది.

కాయిన్స్ ఉపయోగం#

  • వారి ప్రొఫైల్స్‌ని కస్టమైజ్ చేయడానికి యూజర్‌ల ద్వారా ఉపయోగించగల స్టోరు ఐటమ్స్ కొనుగోలు చేయడానికి కాయిన్స్‌ని ఉపయోగించవచ్చు. ఇతర యూజర్‌లకు బహుమతులను పంపడానికి కూడా కాయిన్స్‌ని ఉపయోగించవచ్చు. కాయిన్స్‌ని క్యాష్, లేదా లీగల్ టెండర్, లేదా ఏదైనా రాష్ట్రం, ప్రాంతం యొక్క కరెన్సీతో, లేదా ఏదైనా రాజకీయ పక్షం, లేదా ఏదైనా ఇతర క్రెడిట్ రూపంలో మారకం వేసుకోలేరు.
  • కాయిన్స్‌ని కేవలం మా ఫ్లాట్‌ఫారంపైన మరియు మా సేవల్లో భాగంగా మాత్రమే ఉపయోగించవచ్చు మరియు మా ద్వారా డిజైన్ చేయబడ్డ వాటిని మినహా ఇతర ప్రమోషన్‌లు, కూపన్‌లు, డిస్కౌంట్‌లు లేదా స్పెషల్ ఆఫర్‌లతో కలపలేరు లేదా కలిపి ఉపయోగించలేరు.
  • కాయిన్స్‌ని ఫ్లాట్‌ఫారం యొక్క ఎవరైనా ఇతర యూజర్ లేదా ఏదైనా తృతీయపక్షానికి అసైన్ చేయలేరు లేదా బదిలీ చేయలేరు. మా ద్వారా కాకుండా ఇతరులు కాయిన్స్ విక్రయించడం, వస్తుమార్పిడులు, అసైన్‌మెంట్ లేదా ఇతర డిస్పోజల్ స్పష్టంగా నిషేధించబడింది. ఈ పరిమితి యొక్క ఏదైనా ఉల్లంఘన ఫలితంగా ఫ్లాట్‌ఫారంపై మీ ఖాతా రద్దు, మీ ఖాతా నుంచి కాయిన్స్ జప్తు చేయడం, మరియు/లేదా మీరు నష్టాలు, వ్యాజ్యం మరియు లావాదేవీ ఖర్చుల కొరకు బాధ్యత వహించాల్సి రావొచ్చు.
  • జత అయిన కాయిన్స్‌ ఆస్తిగా పరిగణించబడదు మరియు బదిలీ చేయలేం: (a) మరణించినప్పుడు; (b) గృహ సంబంధ విషయాల్లో భాగంగా; or (c) చట్ట నిర్వహణ ద్వారా మరోవిధంగా.
  • ఈ కాయిన్స్ పాలసీని మీరు ఉల్లంఘించినట్లుగా మేం సహేతుకంగా విశ్వసించినప్పుడు, మీరు ఏదైనా వర్తించే చట్టం లేదా రెగ్యులేషన్ లేదా చట్టపరమైన, భద్రత లేదా సాంకేతిక కారణాల కొరకు మీరు ఉల్లంఘించినప్పుడు అటువంటి కాయిన్స్ నిర్వహణ, నియంత్రణ, సవరించడం, మార్చడం మరియు/లేదా తొలగించే హక్కు మాకు ఉందని మీరు అంగీకరిస్తున్నారు మరియు ఈ హక్కుని మేం వినియోగించుకోవడం ఆధారంగా మేం మీకు ఎలాంటి బాధ్యత వహించం. మేం మా సర్వీస్‌ల నుంచి కాయిన్స్‌ని పూర్తిగా తొలగించాలని మేం నిర్ణయించుకున్నట్లయితే, మీకు తగిన నోటీస్ ఇవ్వడం ద్వారా మేం ఆ విధంగా చేస్తాం.

బహుమతులు ఏవిధంగా పనిచేస్తాయి?#

ప్లాట్‌ఫారమ్‌లో మీ ఖాతాలో అందుబాటులో ఉన్న కాయిన్స్‌ని రీడిమ్ చేయడం ద్వారా మీరు బహుమతులను పొందుతారు. మీరు ఈ బహుమతులను ఇతర యూజర్‌లకు పంపవచ్చు అలాగే ప్లాట్‌పారంపై ఇతర యూజర్‌ల నుండి బహుమతులను అందుకోవచ్చు. మీ ద్వారా పంపిన లేదా అందుకున్న బహుమతులను క్యాష్ లేదా చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేవాటితో మారకం వేసుకోలేరు. ఒక యూజర్, మరో యూజర్‌కు బహుమతిని పంపినప్పుడు, అందుకున్న బహుమతి యొక్క విలువ జెమ్‌ల ("జెమ్‌లు") రూపంలో గ్రహీత అకౌంట్‌లో చూపించబడుతుంది. జెమ్‌లను కాయిన్స్‌గా మరియు విపర్యంగా మార్చుకోలేరు. షేర్‌చాట్ తన విచక్షణ మేరకు అటువంటి జెమ్‌ల విలువను మార్చే హక్కు ఉంది.

బహుమతులు కొనుగోలు చేయడం#

  • బహుమతులు డిజిటల్ ప్రొడక్ట్‌లు మరియు సర్వీస్‌ల యొక్క నిర్ధిష్ట ఫీచర్‌లకు పరిమిత లైసెన్స్‌ని కలిగి ఉంటాయి. ప్రతి కాయిన్ మరియు బహుమతి మధ్య కన్వర్షన్/రిడంప్షన్ రేటు మా ఫ్లాట్‌ఫారం మీద ప్రదర్శించబడుతుంది.
  • పబ్లిష్ చేసిన ధరల్లో మీ న్యాయపరిధిలో వర్తించే చట్టాల కింద అవసరమైన పన్నులు చేర్చబడతాయి.
  • ఏదైనా సాధారణ లేదా నిర్ధిష్ట సందర్భంలో మా పూర్తి విచక్షణ మేరకు తగినదని మేం పేర్కొన్నవిధంగా అటువంటి మారకం రేటును నిర్వహించడానికి, రెగ్యులేట్ చేయడానికి, నియంత్రించడానికి, సవరించడానికి మరియు/లేదా తొలగించడానికి మాకు సంపూర్ణ హక్కు ఉందని మరియు అటువంటి హక్కు అమలు చేయడం ఆధారంగా మేం మీకు ఎలాంటి బాధ్యత వహించం అని మీరు అంగీకరిస్తున్నారు.
  • ఈ కాయిన్స్ పాలసీలో మరోవిధంగా పేర్కొన్నట్లయితే తప్ప, కాయిన్స్‌ని గిఫ్ట్‌గా మార్చేందుకు చేసే అన్ని కన్వర్షన్‌లు/రిడంప్షన్‌లు అంతిమం. మేం ఏవిధంగా రీఫండ్‌లను ఆఫర్ చేయం.
  • బహుమతులను కాయిన్స్ లేదా క్యాష్‌గా మార్చుకోలేరు లేదా మారకం వేసుకోలేరు లేదా ఏదైనా కారణం కొరకు మాద్వారా రీఫండ్ లేదా రీఎంబర్స్ చేయబడదు.
  • ఎవరైనా యూజర్ ద్వారా మార్పిడి చేసుకున్న లేదా అందుకున్న బహుమతులు ఆస్తిగా పరిగణించబడవు మరియు బదిలీ చేయలేం: (a) మరణించినప్పుడు; (b) గృహ సంబంధ విషయాల్లో భాగంగా; or (c) చట్ట నిర్వహణ ద్వారా మరోవిధంగా.
  • ఒక యూజర్ మార్పిడి చేయబడిన లేదా స్వీకరించిన బహుమతులు కరప్ట్కావడం లేదా మరోవిధంగా పాడైపోయినట్లుగా మా పూర్తి విచక్షణ మేరకు మేం నిర్ధారించినట్లయితే ఇంతకు ముందు మారకం చేసుకున్న గిఫ్ట్‌ల కాపీలను మేం రీప్లేస్ చేయవచ్చు. కరప్ట్ అయిన లేదా మరెవిధంగా పాడైపోయిన బహుమతిని తిరిగి జారీ చేయడానికి మేం అదనంగా ఛార్జ్ చేయం. మీరు కరప్ట్ అయిన లేదా మరోవిధంగా పాడైపోయిన బహుమతిని అందుకున్నట్లయితే, contact@sharechat.co వద్ద మమ్మల్ని సంప్రదించండి.
  • మీరు కాయిన్స్ ఫీచర్‌ని దుర్వినియోగం చేసినా లేదా ఈ కాయిన్స్ పాలసీని మీరు ఉల్లంఘించినా, తొలగించే లేదా మీకు విరుద్ధంగా తగిన చర్య తీసుకునే హక్కు మాకు దఖలు పడి ఉంటుంది.
  • ప్లాట్‌ఫారంపై ఎవరైనా యూజర్ నుంచి ఏదైనా గూడ్స్ లేదా సర్వీస్‌లను అందుకోవడానికి ఏదైనా గిఫ్ట్ లేదా కాయిన్ ఉపయోగించేందుకు మీరు అనుమతించబడరు.

ప్రభావం చూపించే వారు లేదా ఇతర యూజర్ జనరేటెడ్ కంటెంట్ కొరకు మీరు బహుమతులను ఎలా ఉపయోగించవచ్చు#

  • యూజర్ లేదా ప్రభావం చూపించేవారు జనరేట్ చేసిన కంటెంట్ ("క్రియేటర్‌")కు సంబంధించి, అటువంటి క్రియేటర్ ద్వారా అప్‌లోడ్ చేయబడ్డ క్రియేటర్ కంటెంట్ యొక్క ఐటమ్‌కు రేట్ చేయడానికి లేదా మీ ప్రశంసను చూపించడానికి మీరు బహుమతులను ఉపయోగించవచ్చు. ఈ ఫంక్షనాలిటీ సేవలపై లభ్యమవుతుంది, మరియు "పంపండి" బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు క్రియేటర్‌లకు బహుమతిని కంట్రిబ్యూట్ చేయవచ్చు.
  • ఒక క్రియేటర్‌కు పంపాలని అనుకునే బహుమతిని ఎంచుకొని, "పంపండి" బటన్ మీద క్లిక్ చేసినప్పుడు, ఈ బహుమతి క్రియేటర్ అకౌంట్‌కు పంపబడుతుంది.
  • మీరు ఒక క్రియేటర్‌కు ఒక బహుమతిని ఇచ్చినట్లయితే, మీరు అలా బహిరంగంగా చేస్తారని దయచేసి గమనించండి. అందువల్ల ఫ్లాట్‌ఫారం యొక్క ఇతర యూజర్‌లు (బహుమతి గ్రహీతతో సహా) మీ పేరు మరియు బహుమతి వివరాలను చూడవచ్చు.

నివేదించడం#

యూజర్ ద్వారా ఈ కాయిన్స్ పాలసీ ఉల్లంఘించినట్లుగా మీరు గమనించినట్లయితే, దయచేసి దానిని contact@sharechat.co వద్ద నివేదించండి.

కాయిన్స్ పాలసీని ఉల్లంఘించినట్లుగా అనేకసార్లు నివేదించినట్లయితే, మేం అనివార్యంగా మాతో మీ ఖాతాను రద్దు చేసి, మాతో రిజిస్టర్ కాకుండా మిమ్మల్ని నిరోధించవచ్చు. మీరు అటువంటి తొలగింపును మీరు అప్పీల్ చేయాలని కోరుకున్నట్లయితే, మీరు contact@sharechat.co

వద్ద మాకు రాయవచ్చు. ఉపయోగించని లేదా రీడిమ్ చేసుకోని కాయిన్‌లు లేదా బహుమతులకు ఎలాంటి రీఫండ్‌లు ఉండవు, అందువల్ల మీ అకౌంట్‌ని రద్దు చేయడానికి ముందు వాటిని ఉపయోగించాలని మేం సిఫారసు చేస్తున్నాం.

యూజర్‌లకు గమనికలు#

  • మీరు నాణేల కొనుగోలుకు పన్ను ఇన్వాయిస్ అవసరమైతే, దయచేసి మీ ఆర్డర్ ఐడిని తెలుపుతు ar@sharechat.co కు మెయిల్ చేయండి, మా బృందం దాన్ని త్వరగా జారీ చేస్తుంది.
  • కాయిన్స్/బహుమతులు వ్యక్తిగత గూడ్స్‌గా పరిగణించబడవు, అయితే ఫ్లాట్‌ఫారం ద్వారా జారీ చేసిన ఐటమ్‌లకు లైసెన్స్‌డ్ యాక్సెస్ వలే పరిగణించబడుతుంది.
  • ఇంటర్నెట్‌పై ట్రేడింగ్ చేయడానికి కాయిన్స్‌ని ఉపయోగించలేరు.
  • ప్లాట్‌ఫారంపై మీరు కొనుగోలు చేసే కాయిన్‌లు/బహుమతులకు మీరే పూర్తిగా బాధ్యత వహిస్తారు, అటువంటి కాయిన్‌లు/బహుమతులకు సంబంధించి మాకు ఎలాంటి లయబిలిటీ లేదా బాధ్యత ఉండదని మీరు అంగీకరిస్తున్నారు.
  • ఏది ఉల్లంఘనకు అని మా పూర్తి విచక్షణ మేరకు నిర్ధారించే హక్కు మాకు దఖలు పడి ఉంటుంది.
  • ఏ సమయంలోనైనా ఈ కాయిన్స్ పాలసీ యొక్క భాగాలను మా పూర్తి విచక్షణ మేరకు మార్చేందుకు మాకు హక్కు దఖలు పడి ఉంటుంది. మేం ఈ విధంగా చేసినట్లయితే, మేం ఈ పేజీపై మార్పులను పోస్ట్ చేస్తాం మరియు ఈ నిబంధనలు చివరిగా అప్‌డేట్ చేసిన తేదీని ఈ పేజీ పైన సూచిస్తాం.