Sharechat Boost Post FAQ
1. పోస్ట్ బూస్ట్ అయిన తర్వాత నా పోస్ట్‌లలో ఎందుకు promoted ట్యాగ్స్ కనిపిస్తున్నాయి?
బాస్ట్ అనేది నిర్ధిష్ట వ్యూస్ వచ్చేలా చూసేందుకు మా ప్లాట్‌ఫామ్ అందించే ఫీచర్. ఇది మా ప్లాట్‌ఫామ్‌లో ప్రకటన కాబట్టి దీనిని స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
2. నేను పోస్ట్‌ను మ్యూజిక్‌తో బూస్ట్ చేయొచ్చా?
మీరు మా లైబ్రరీలోని మ్యూజిక్ ఉపయోగించిన పోస్ట్‌ను బూస్ట్ చేయలేరు లేదా కాపీరైట్‌ను ఉల్లంఘించడం కుదరదు.
3. ఒకేసారి ఎన్ని పోస్ట్‌లను బూస్ట్ చేయొచ్చు?
ఒక్కసారి 1-5 పోస్ట్‌లను బూస్ట్ చేయవచ్చు
4. నేను ఒకటి కంటే ఎక్కువ పోస్ట్‌లను ఎంచుకంటే. బూస్ట్ ప్రక్రియ ఎలా ఉంటుంది?
మీరు ఒకటికంటే ఎక్కువ పోస్ట్‌లను బూస్ట్ కోసం ఎంచుకంటే ప్యాకేజీలోని వ్యూస్ మొత్తం మీరు ఎంచుకున్న పోస్ట్‌లకు అవసరానికి తగ్గట్లు పంచడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు 4 పోస్ట్‌లు ఎంచుకుని రూ.99తో 5000 వ్యూస్ ప్యాకేజీని తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు 5000 వ్యూస్‌ను ఆ 4 పోస్ట్‌లకు అవసరానికి తగ్గట్లుగా పంచడం జరుగుతుంది. వ్యూస్ లేదా మేము అందించే ఇతర మెట్రిక్స్ సంఖ్య అందాజు సంఖ్య మాత్రమే నిజానికి ఇవి ఎక్కువ లేదా తక్కువగా ఉండొచ్చు.
5. బూస్ట్ పోస్ట్ ప్రొఫైల్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
ఇతర పోస్ట్‌లకు వచ్చే సాధారణ వ్యూస్‌పై బూస్ట్ పోస్ట్‌లు ఎలాంటి ప్రభావం చూపవు.
6. పోస్ట్‌లను బూస్ట్ చేస్తే మైల్‌స్టోన్ రివార్డ్‌లు లభిస్తాయా?
బూస్ట్ పోస్ట్ ద్వారా వచ్చిన వ్యూస్‌కు మైల్‌స్టోన్ రివార్డ్‌లు పొందే అర్హత ఉండదు
7. ప్రకటన/బ్రాండ్ కంటెంట్‌ను బూస్ట్ చేయొచ్చా?
ప్రకటనలు/బ్రాండ్ కంటెంట్‌తో కూడిన పోస్ట్‌లను కూడా బూస్ట్ చేయొచ్చు. అయితే ఆ కంటెంట్ కచ్చితంగా షేర్‌చాట్ ప్రకటన పాలసీలను పాటించాలి.
8. రివ్యూ దశలో ఎలాంటి పోస్ట్‌లు తిరస్కరించబడతాయి?
మా లైబ్రరీలోని మ్యూజిక్‌ను వాడిన కంటెంట్ లేదా మా వినియోగ నిబంధలు, షేర్‌చాట్ ప్రకటన పాలసీ, కమ్యూనిటీ, ఇతర స్థానిక చట్టాల మార్గదర్శకాలను ఉల్లంఘించే పోస్ట్‌లను బూస్ట్ చేయడం కుదరదు.
9. పోస్ట్‌లు రివ్యూ దశ పూర్తి చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది?
రివ్యూ పూర్తి చేసుకుని మీ పోస్ట్ బూస్ట్ అయ్యేందుకు 48 గంటల సమయం పడుతుంది.
10. పేమెంట్ పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుంది?
పేమెంట్ విజయవంతమై మాకు చేరుకోవడానికి 3-5 పని దినాలు పడుతుంది
11. నా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యి మీకు చేరకపోతే ఏం చేయాలి?
మీ అకౌంట్‌లో డబ్బు కట్ అయ్యి మాకు చేరుకోలేదంటే పేమెంట్ స్టేటస్ ఫెయిల్ అయినట్లు చూపిస్తుంది. అలాంటప్పుడు సంబంధిత బ్యాంక్ మీ డబ్బును 3-5 రోజుల్లో మీ అకౌంట్లోకి తిరిగి జమ చేస్తుంది.
12. బూస్ట్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు నేను రీఫండ్ కోరవచ్చా?
మీ బూస్ట్ అభ్యర్థన ఆమోదించబడిన తర్వాత మరియు కొనసాగుతున్నప్పుడు రీఫండ్ కోరలేరు.
13. నేను రీఫండ్ ఎప్పుడు కోరవచ్చు?
బూస్ట్ అభ్యర్థన తిరస్కరించబడితే రీఫండ్ ఆటోమేటిగ్‌గా జరిగిపోతుంది. రీఫండ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు 5-7 పని దినాల సమయం పడుతుంది.